ముగిసిన మౌనపోరాటం ఒక్కటైన ప్రేమజంట | Girl Protest On Her Lover Home And Tie Each Other In Luxettipet | Sakshi
Sakshi News home page

ముగిసిన మౌనపోరాటం ఒక్కటైన ప్రేమజంట

Published Wed, Oct 7 2020 9:27 AM | Last Updated on Wed, Oct 7 2020 9:27 AM

Girl Protest On Her Lover Home And Tie Each Other In Luxettipet - Sakshi

వివాహానికి ఒప్పుకొని దండలు మార్చుకున్న ప్రేమజంట, నాలుగు రోజులు మౌన పోరాటం

సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న యువతి మౌన పోరాటం మంగళవారం ముగిసింది. యువకుడి కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం పట్టణానికి చెందిన లలిత.. వెంకట్రావుపేటకు చెందిన అరుణ్‌ ప్రేమించుకున్నారు. కాని వివాహానికి యువకుడి కుటుంబసభ్యులు నిరాకరించడంతో లలిత కుటుంబసభ్యులతో కలిసి అరుణ్‌ ఇంటి ఎదుట నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తున్నారు. మంగళవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అడ్డుకొని శాంతింపజేశారు. యువకుడిని రప్పించి స్థానిక పెద్దమ్మ గుడి వద్ద రెండు కుటుంబాల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు మాట్లాడి యువకుడి కుటుంబసభ్యులను వివాహానికి ఒప్పించారు. అనంతరం ఇద్దరికి నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం జరిపిస్తామని హామీ ఇవ్వడంతో యువతి కుటుంసభ్యులు శాంతించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement