Girl Protest
-
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
సాక్షి, జగిత్యాల: ప్రేమ పేరుతో రహస్యంగా వివాహం చేసుకొని, కుమారుడు పుట్టిన తర్వాత తనకేమీ తెలియదంటూ మోసం చేశాడని ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాల్లోకి వెళ్లే.. జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుజ్జుల స్వప్న, అదే గ్రామానికి చెందిన కట్కూరి వెంకటేశ్ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల కిందట రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ పలుమార్లు విదేశాలకు వెళ్లివచ్చాడు. వీరికి మూడేళ్ల కిందట బాబు జన్మించాడు. గల్ఫ్ నుంచి రెండు నెలల కిందట స్వగ్రామం వచ్చిన వెంకటేశ్ స్వప్నను నువ్వు ఎవరో నాకు తెలియదన్నాడు. కుమారుడు కూడా నాకు పుట్టలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో స్వప్న మంగళవారం అతని ఇంటి ఎదుట కుమారుడితో కలిసి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. -
ముగిసిన మౌనపోరాటం ఒక్కటైన ప్రేమజంట
సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న యువతి మౌన పోరాటం మంగళవారం ముగిసింది. యువకుడి కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం పట్టణానికి చెందిన లలిత.. వెంకట్రావుపేటకు చెందిన అరుణ్ ప్రేమించుకున్నారు. కాని వివాహానికి యువకుడి కుటుంబసభ్యులు నిరాకరించడంతో లలిత కుటుంబసభ్యులతో కలిసి అరుణ్ ఇంటి ఎదుట నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తున్నారు. మంగళవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అడ్డుకొని శాంతింపజేశారు. యువకుడిని రప్పించి స్థానిక పెద్దమ్మ గుడి వద్ద రెండు కుటుంబాల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు మాట్లాడి యువకుడి కుటుంబసభ్యులను వివాహానికి ఒప్పించారు. అనంతరం ఇద్దరికి నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం జరిపిస్తామని హామీ ఇవ్వడంతో యువతి కుటుంసభ్యులు శాంతించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం
బెజ్జూర్(సిర్పూర్): ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది.. వివరాల్లోకి వెళ్తే బెజ్జూర్ మండలం బారేగూడె గ్రామానికి చెందిన మౌనిక అదే గ్రామానికి చెందిన చిప్ప రమేష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెండ్లి చేసుకోవాలని మౌనిక కోరడంతో నిరాకరించాడు. కోరిక తీరక తనను మోసం చేశాడని మౌనిక మంగళవారం ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటానికి దిగింది. గత 15 రోజుల క్రితం కులపెద్దలు, గ్రామస్తులతో పంచాయతీ నిర్వహించగా పెండ్లి చేసుకుంటానని రమేష్ అంగీకరించాడని, తల్లి మాటలు విని గ్రామం నుంచి ఏటో వెళ్ళాడని పేర్కొంది. రమేష్ వచ్చి తనను పెండ్లి చేసుకునేంతవరకు మౌనపోరాటం విరమించేది లేదని పేర్కొంది. గ్రామస్తులు కొంతమంది ఆమెకు మద్దతు తెలిపారు. ఈ విషయంపై బెజ్జూర్ పోలీసులను వివరణ కోరగా రమేశ్‌పై లికితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
సాఫ్ట్వేర్ ప్రియుడి కోసం రూ.1.50లక్షల..
చిన్నచింతకుంట (దేవరకద్ర): ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు సహజీవనం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకి దిగిన సంఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మద్దూర్ గ్రామానికి చెందిన జుట్ల నర్మద, చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన మక్క మోహన్‌కుమార్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇలా ప్రేమించుకుంటున్న సమయంలోనే నర్మద, మోహన్‌కుమార్ ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లారు. నర్మద చిక్కడపల్లి ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌కాలేజీలో 2010 నుంచి 2014 సంవత్సరం వరకు విద్యనభ్యసిస్తూనే ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అలాగే, మోహన్‌కుమార్ ఓ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించి కాగ్నిజెంట్ డీఎల్ఎఫ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రియుడి చదువు కోసం రూ.1.50లక్షల ఖర్చు ఈ క్రమంలోనే మోహన్ పైచదువు కోసం నర్మద రూ.1,50,000 వరకు సాయం అందించింది. 2014సంవత్సరంలో నర్మద కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మోహన్ మేమిద్దరం పెళ్లిచేసుకుంటామని, వేరే సంబంధాలు చూడవద్దని చెప్పడంతో నర్మద కుటుంబీకులు కూడా ఆమె సంబంధాల గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014 నుంచి 2019వరకు దాదాపుగా 5ఏళ్లుగా వీరిద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. ఇదే తరుణంలో నన్ను పెళ్లిచేసుకోమని మోహన్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా మా చెల్లెలి పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందామని దాటవేస్తూ వచ్చాడు. అనంతరం మోహన్‌కుమార్ చెల్లెలి పెళ్లి కూడా పూర్తయింది. తల్లి ఒప్పుకోవట్లేదని పెళ్లికి నిరాకరణ.. ఇదిలాఉండగా, గత 6నెలల క్రితం ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో మోహన్‌కుమార్ నర్మదతో పెళ్లికి అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుండి పెళ్లి చేసుకుందామని నర్మద, మోహన్‌కుమార్‌ను పట్టుపడుతూ వచ్చింది. ఇటీవల నిన్ను పెళ్లిచేసుకుంటే మా అమ్మ చనిపోతానని అంటుందని, అందుకే నీతో పెళ్లికి నిరాకరిస్తున్నానని మోహన్ తేల్చిచెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి కొన్నిరోజుల కిందట ఎస్పీని కలిసే ప్రయత్నం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించడంతో నర్మద గత మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ కూడా జాప్యం జరగడంతో గత్యంతరం లేక ప్రియుడు మోహన్‌కుమార్ ఇంటి ఎదుట గత మూడురోజులుగా ధర్నాకి కూర్చుంది. పెళ్లంటూ జరిగితే మోహన్‌తోనే జరగాలని, లేదంటే న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని నర్మద తెలిపారు. చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద -
ప్రేమపేరుతో మోసం చేశాడని.. యువతి
మానకొండూర్: ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కలకాలం తోడుంటానన్నాడు. నమ్మిన ఆ యువతి ప్రేమను అంగీకరించింది. ఐదేళ్లకు పైగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చదువైపోగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇద్దరి చదువు పూర్తయ్యింది. ఇక పెళ్లి చేసుకుందామని యువతి కోరింది. అంతా సిద్ధం చేసుకుని ఆలయానికి వెళ్లారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతి పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడా యువకుడు పెళ్లికి ముఖం చాటేశాడు. తాను ప్రేమించిన అమ్మాయి వద్దని ఇంటినుంచి పారిపోయాడు. దీంతో సదరు యువతి ప్రియుడి ఇంటిఎదుట బైఠాయించింది.ఈ ఘటన మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఐదేళ్లనుంచి ప్రేమ.. మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన అంతగిరి లక్ష్మయ్య– పరమేశ్వరి దంపతుల పెద్దకూతురు నందిని(25) ఏంబీఏ పూర్తిచేసింది.ఇదే గ్రామానికి చెందిన ఎనగంటి గణపతి, గంగా దంపతుల చిన్నకొడుకు ఎనగంటి శ్రీధర్ ఊరాఫ్ లక్ష్మణ్(24) డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పెద్దపల్లిలో ఉంటున్నాడు. ఐదేళ్లక్రితం నందినిని ప్రేమించమని శ్రీధర్ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ప్రేమను అంగీకరించింది. ఇద్దరి చదువు పూర్తయ్యింది. మధ్యలో నందినికి వచ్చిన పెళ్లి సంబంధాలను శ్రీధర్ చెడగొడుతూ వచ్చాడు. తమ కూతురును పెళ్లి చేసుకుంటానని నందిని తల్లిదండ్రులకూ మాటిచ్చాడు. పెళ్లి వరకు వెళ్లి.. ఇటీవల శ్రీధర్ సోదరుడి వివాహమైంది. ఇదే క్రమంలో నందిని – శ్రీధర్ ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలిసింది. దీంతో బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందాని అనుకున్నారు. గత ఆదివారం తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్‌లోని నృసింహుని ఆలయం వద్దకు వెళ్లారు. తాళి కట్టేసమయంలో శ్రీధర్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. వారి వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి సాయంతో శ్రీధర్‌ను తీసుకెళ్లారు. పోలీసులను ఆశ్రయించిన యువతి.. నందిని మానకొండూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇరుకు టుంబాలను పిలిపించి సీఐ ఇంద్రసేనారెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చా రు. నందినిని పెళ్లి చేసుకోవాలని శ్రీధర్‌కు సూచించగా నిరాకరించాడు. మరుసటి రోజునుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. మోసపోయానని బైఠాయింపు.. మోసపోయానని గ్రహించిన నందిని తనకు న్యాయం చేయా లని శనివారం ఉదయం ప్రియుడి ఇంటిఎదుట బైటాయించింది. శ్రీధర్ తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చుంది. నందినికి రజక కులస్తులు, గ్రామస్తులు, మహిళా సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నందినితో మాట్లాడుతున్న క్రమంలోనే కిరోసిన్ పోసుకునేందుకు యత్నించింది. పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు. నందినిని మద్దతుగా నిలిచిన రజకసంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ మాట్లాడుతూ... శ్రీధర్‌కు దగ్గర బంధువైన శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే పెళ్లికి నిరాకరించాడని ఆరోపించారు. న్యాయం చేయకుంటే మూడువేల మందితో శ్రీధర్ ఇంటిఎదుట ఆందో ళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు నడిగొట్టు రవి, శాతరాజు యాదగిరి, సంపత్, ముత్తూరి కొంరయ్య రాయికంటి కిరణ్, గంగధర లక్ష్మయ్య, అంతగిరి సంపత్ తదితరులు మద్దతుగా నిలిచిన వారిలో ఉన్నారు. -
న్యాయం కోసం.. సెల్ టవర్ ఎక్కిన యువతి
సాక్షి, వరంగల్: తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ తనకు న్యాయం చేయాలని ఏకంగా సెల్ టవర్ ఎక్కిన యువతి. ఈ ఘటన మంగళవారం జిల్లాలోని పెగడపెల్లిలో చేటు చేసుకుంది. కుటుంబ సభ్యలు, వయుతి తెలిపిన వివరాలు ప్రకారం.. పెగడపల్లికి గ్రామానికి చెందిన దామెరా మాలిక అదే ప్రాంతానికి చెందిన నక్క మహేష్ గత 9 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. యువకుడు ఇప్పుడు నీవు నాకు అవసరం లేదంటున్నాడని యువతి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేయడంతో అమె తల్లిదంద్రుడలు, కుటుంబ సభ్యలు భయందోళనకు గురవుతున్నారు. -
ప్రేమన్నాడు.. పెళ్లాడాడు.. పొమ్మన్నాడు...
నేలకొండపల్లి: అతడొక ఆర్ఎంపీ. ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ వైద్యం చేస్తుంటాడు. ఓ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెతో పరిచయం స్నేహం పెంచుకున్నాడు. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. చాలా ‘దగ్గర’య్యాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. గుడిలో రహస్యంగా పెళ్లాడాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత... వద్ద పొమ్మంటున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె... అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామ యువకుడైన బొయిన చైతన్య, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వృత్తిరీత్యా అతనితో అందరూ చనువుగా ఉండేవాడు. మూడేళ్ల క్రితం, అదే గ్రామంలోని డిగ్రీ విద్యార్థిని గొడుగు సంధ్యపై కన్నేశాడు. ఆమెతో చనువు పెంచుకున్నాడు. ‘మనిద్దరం స్నేహితులమ’న్నాడు. ఆమె తలూపింది. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ ‘దగ్గర’య్యారు. గత ఏడాది, ఖమ్మంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తన ఫోన్ లో వేద మంత్రాల ఆడియో ఆన్ చేసి తాళి కట్టాడు. ఆమె గర్భవతయింది. అతడే అబార్షన్ చేశాడు. ఆ తరువాత ఇద్దరూ చెట్టపట్టాలేసుకసుని, పట్టపగ్గాల్లేకుండా తిరిగారు. గత నెల 21న బైక్‌పై జగ్గయ్యపేట వెళుతున్న వీరిద్దరిని ఆమె బంధువులు చూశారు. ఆమె ఇంటోళ్లకు తెలిసింది. వారు అతడిని నిలదీశారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. అప్పటి నుంచి అతడు బలుసుపాడులో ప్రాక్టీస్ మానేశాడు. ఆమెను పట్టించుకోవడం లేదు. ‘నీ దారిన నువ్వు వెళ్లు. నాతో ఉండొద్దు. వెళ్లిపో...’ అంటున్నాడు. దీంతో, ఆమె ఆదివారం సాయంత్రం తన కుటుంబీకులతో కలిసి చైతన్య ఇంటికి వచ్చింది. ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను భార్యగా స్వీకరించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించింది. చైతన్య, అతడి కుటుంబీకులు తమ ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయారు. ఆమె నుంచి వివరాలను ఎస్సై ఎన్.గౌతమ్ తెలుసుకున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడతా... అంటోంది సంధ్య. ‘‘నన్ను నమ్మించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు, మనిద్దరికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాను. చైతన్యకు, నాకు.. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేయించాలి’’ అని డిమాండ్ చేస్తోంది. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
రామన్నపేట (నకిరేకల్) : ప్రేమించిన యువకుడితోనే వివాహం జరిపించాలని యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఆదివారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాయిగూడెం గ్రామానికి చెం దిన వీరమల్ల ప్రసన్న, అదేగ్రామానికి చెందిన రేపాక గణేశ్‌లు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించు కుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల గణేశ్‌కు వేరే యువతితో వివాహం కుదిరింది. విష యం తెలుసుకున్న యువతి రామన్నపేట పోలీ స్స్టేషన్లో గణేశ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుం టానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని అతడిపై ఈనెల 16న రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు, గ్రామపెద్దలు ఇద్దరికీ పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. యువకుడు గణేశ్ ప్రసన్న తనకు సోదరితో సమానమని బుకాయించసాగాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయువతి గణేశ్‌తో వివా హం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివా రం కొమ్మాయిగూడెంలో అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఆమెకు గ్రామస్తులు, బంధువులు మద్దతు పలికారు. కుటుంబసభ్యులు అక్కడే వంటచేసుకుని భుజించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సీహెచ్ సాయిలు యు వతి ధర్నా చేస్తున్న ఇంటివద్దకు వెళ్లి ఆమెతో మా ట్లాడారు. మోసంచేసిన యువకుడిపై ఫిర్యాదుచేస్తే కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. తనను ప్రేమించాలని చాలా కాలం వేధించాడని, కులాలు వేరైనా పెద్దలు అంగీకరించక పోయినా తప్పకుండా పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి గణేశ్ తనను మోసం చేశాడని, మధ్యలో తనకు వివాహ సంబంధాలు వచ్చినా చేసుకోనీ యలేదని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. కట్నం డబ్బులకు ఆశపడి తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. అతనితో తన వివాహం జరిపించాలని వేడుకున్నది. జీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇచ్చిన యువతి ఆందోళన విరమించలేదు. -
ప్రియుని ఇంటి ఎదుట ప్రియురాలి నిరాహార దీక్ష
మలికిపురం (రాజోలు): ప్రియుని ఇంటి ఎదుట ప్రియురాలు నిరాహా దీక్ష చేపట్టిం ది. మండలంలోని బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లు శ్రీదేవి, పెసింగి బాలరాజు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెసింగు బాలరాజు పెళ్లి గురించి ప్రస్తావిస్తే ముఖం చాటేశాడని శ్రీదేవి గ్రామ పెద్దల మధ్య పెట్టింది. అయినా బాలరాజు వినలేదని గత్యంతరం లేక బాలరాజు ఇంటికి పెట్టే బేడా సర్దుకుని చేరుకుంది. బాలరాజు కుటుంబీకులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లి పోవడంతో శ్రీదేవి ఆ ఇంటి వద్దనే శనివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించింది. యువతికి పలువురు సంఘీభావం తెలిపారు. -
పెళ్లి అనగానే మాట మార్చాడు..!
విశాఖపట్నం: ప్రేమికుడి మాయ మాటలు నమ్మి మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతోంది. మోసానికి పాల్పడిన వంచకుడు మాత్రం మరో యువతితో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ప్రేమించానని మోసం చేసిన వ్యక్తితోనే తన పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరుతూ ఆ యువతి గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద బంధువులతో కలిసి మంగళవారం ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే... స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఒక మహిళ కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తె (21)ని డిగ్రీ వరకు చదివించింది. సమీప బంధువు, ఆటో డ్రైవర్ చిల్ల దుర్గారెడ్డి ప్రేమిస్తున్నానని నమ్మించి స్వాతికి దగ్గరయ్యాడు. మాయమాటలతో లోబరుచుకోవడంతో యువతి గర్భం దాల్చింది. ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని దుర్గారెడ్డిపై ఒత్తిడి తెచ్చింది. సరేనని చెప్పిన దుర్గారెడ్డి బలం మాత్రల పేరుతో అబార్షన్ మాత్రలను ఇచ్చాడు. వాటిని వినియోగించడంతో స్వాతికి తీవ్ర కడుపునొప్పి, ఆ తర్వాత రక్తస్రావమయింది. అనంతరం గత నెల 29న తెల్లవారి 3 గంటలకు బాత్రూమ్కు వెళ్లిన స్వాతి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ విషయం కుటుంబ సభ్యులతో చెప్పకుండా తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లిని, సోదరుడిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది. తర్వాత ఇంటికి తిరిగొచ్చిన స్వాతి సోదరుడు బాత్రూమ్లో ఆడ శిశువును చూసి నగరంలోని కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ శిశువు మృతి చెందింది. దీంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది. వివాహం చేసుకుంటానని మోసం ఆ సమయంలో తల్లిదండ్రులతో ఆస్పత్రికి వచ్చి యువతిని పరామర్శించిన దుర్గారెడ్డి ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. సాయంత్రానికి తిరిగి వస్తానన్న వ్యక్తి ఫోన్ చేసి వివాహం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మృత శిశువుతో చిల్లపేట వెళ్లినప్పటికీ మోసగాడి ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో బాధితురాలు మృత శిశువుతోనే ఆందోళనకు దిగింది. దీంతో అక్కడి పెద్దలు లక్ష రూపాయలు తీసుకుని విషయాన్ని మరిచిపోవాలని స్వాతికి సూచించారు. ఇక అక్కడ న్యాయం జరగదని భావించిన బాధితురాలు గాజువాక పోలీసులను ఈ నెల 1న ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పేరుతో రెండు వారాలుగా కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నెల 18న మరో యువతితో దుర్గారెడ్డికి వివాహం జరగనుండటంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. ఫిర్యాదు ఇచ్చినప్పుడు విచారణ కోసం వచ్చిన మోసగాడిని కూడా పోలీసులు విడిచి పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు మాత్రం దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఎప్పటి మాదిరిగానే హామీ ఇచ్చి బాధితురాలిని పంపించేశారు. ఈ విషయంపై ఎస్ఐ అప్పలరాజును సంప్రదించగా నిందితుడిని పట్టుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాము వెళ్లిన ప్రతిసారీ నిందితుడు పరారవుతున్నాడని పేర్కొన్నారు.