
మలికిపురం (రాజోలు): ప్రియుని ఇంటి ఎదుట ప్రియురాలు నిరాహా దీక్ష చేపట్టిం ది. మండలంలోని బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లు శ్రీదేవి, పెసింగి బాలరాజు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెసింగు బాలరాజు పెళ్లి గురించి ప్రస్తావిస్తే ముఖం చాటేశాడని శ్రీదేవి గ్రామ పెద్దల మధ్య పెట్టింది. అయినా బాలరాజు వినలేదని గత్యంతరం లేక బాలరాజు ఇంటికి పెట్టే బేడా సర్దుకుని చేరుకుంది. బాలరాజు కుటుంబీకులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లి పోవడంతో శ్రీదేవి ఆ ఇంటి వద్దనే శనివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించింది. యువతికి పలువురు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment