boyfriend house
-
ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష
వరంగల్: వారిద్దరూ దూరపు బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలిశారు. హనుమకొండలో ఉంటూ వేర్వేరుగా ప్రైవేట్‌గా ఉద్యోగాలు చేసే వారు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఆ యువకుడు కన్పించకుండా పోయాడు. దీంతో తనను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని పట్టుబట్టిన యువతి సదరు యువకుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బయన హరిశంకర్ హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన అనుశెట్టి సుప్రియ ప్రేమించుకుని, పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో హరిశంకర్ అదృశ్యమయ్యాడు. దీంతో సుప్రియ ప్రియుడి గ్రామానికి చేరుకుని శుక్రవారం దీక్షకు దిగింది. తల్లిదండ్రుల మాటలు విని నన్ను దూరం చేస్తున్నాడని, న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని సుప్రియ పేర్కొంటూ కన్నీటి పర్యంతమైంది. హరిశంకర్ పెళ్లి చేసుకోవడం లేదని హనుమకొండలోని పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని దీంతో అతని ఇంటివద్ద దీక్ష చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రియుడితో మాట్లాడే ప్రయత్నం చేయగా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. స్థానిక ఎస్సై రాజును వివరణ కోరగా.. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు చెప్పారు. -
శారీరకంగా వాడుకొని మోసం చేశాడని..
సాక్షి, భీమరదేవరపల్లి(వరంగల్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపలతికి చెందిన సంకనేని సునంద.. చంటయపల్లికి చెందిన కొన్నె రమేష్ మద్య నాలుగేళ్ల క్రితం రాంగ్ కాల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. చదవండి: ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య ఈ క్రమంలో రమేష్ ఆర్మీ జవాన్ కాగా సెలవుల్లో ఇంట్లికి వచ్చినపుడల్లా ఇరువురు కలుసుకునేవారు. అయితే తనను పెళ్లి చేసుకుంటాని నమ్మబలకడంతో దగ్గరయ్యానని బాధితురాలు తెలిపింది. ఇటీవల తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రమేష్ ఇంటికికి వెళ్లగా వేరే అమ్మాయితే నిశ్చితార్థం జరిగినట్లు తెలిసిందని చెప్పింది. తనకు రమేష్‌తో వివాహం జరిపించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మౌన పోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్సై రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. యువతి మౌన పోరాటానికి మద్దతు తెలిపారు. చదవండి: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు
మద్దూరు(హుస్నాబాద్): ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని అరుజన్పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారంగ్రామానికి చెందిన సురేష్‌గౌడ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకొని తీరా పెళ్లి చేసుకోమని అడిగితే నీ కులం వేరు అంటున్నాడని తెలిపింది. దీంతో మద్దూరు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు రక్షించి సురేష్‌గౌడ్ ఇంటి ఎదుట బైఠాయించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
శ్రీరంగాపూర్: మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి(22) ఇదే గ్రామానికి చెందిన పరశురాముడు(30) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన కులపెద్దలు కులం, గోత్రం ఇద్దరివి ఒకటే కావడంతో వరుసలు కలువదని, ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. అనంతరం యువతికి మరొకరితో పెళ్లి కూడా చేశారు. కానీ ప్రియుడిపై ప్రేమతో పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను వదిలి యువతి పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం పరశురాముడు మరో యువతితో పెళ్లికి సిద్ధపడడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు 24 గంటల్లో న్యాయం చేయకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని హెచ్చరించింది. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష
-
ప్రియుని ఇంటి ఎదుట ప్రియురాలి నిరాహార దీక్ష
మలికిపురం (రాజోలు): ప్రియుని ఇంటి ఎదుట ప్రియురాలు నిరాహా దీక్ష చేపట్టిం ది. మండలంలోని బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లు శ్రీదేవి, పెసింగి బాలరాజు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెసింగు బాలరాజు పెళ్లి గురించి ప్రస్తావిస్తే ముఖం చాటేశాడని శ్రీదేవి గ్రామ పెద్దల మధ్య పెట్టింది. అయినా బాలరాజు వినలేదని గత్యంతరం లేక బాలరాజు ఇంటికి పెట్టే బేడా సర్దుకుని చేరుకుంది. బాలరాజు కుటుంబీకులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లి పోవడంతో శ్రీదేవి ఆ ఇంటి వద్దనే శనివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించింది. యువతికి పలువురు సంఘీభావం తెలిపారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
అన్నానగర్: పెన్నడం సమీపంలో ప్రియుడి ఇంటి ముందు మహిళ సోమవారం ధర్నా చేసింది. వివరాలు.. కడలూరు జిల్లా పెన్నడం సమీపం సౌందర సోళపురానికి చెందిన రామమూర్తి రిటైర్డ్ గ్రామ నిర్వాహక అధికారి. ఇతని కుమార్తె కనిమొళి (31) ఎంఏ పట్టభద్రురాలు. ఈమె పెన్నడంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. సౌందర సాళపురానికి చెందిన మురుగేశన్ కుమారుడు జానకిరామన్ (32) డీఎంకే కార్యదర్శి. ఇతను పెన్నడంలో ఇటుకలబట్టి నడుపుతున్నాడు. కనిమొళి జానకిరామన్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో కనిమొళి వివాహం చేసుకోవాలని జానకిరామన్‌ను కోరింది. అందుకు అతను అంగీకరించలేదు. దీంతో విరుదాచలం మహిళ పోలీసుస్టేషన్లో కనిమొళి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ స్థితిలో జానకిరామన్ హఠాత్తుగా పరారయ్యాడు. కనిమొళి అతని కోసం వెతికినా ఆచూకీ తెలియలేదు. కనిమొళి సోమవారం సౌందరపాళయపురంలోని జానకిరామన్ ఇంటికి వెళ్లింది. జానికిరామన్ తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. జానకిరామన్‌తో వివాహం చేయాలని కోరగా అందుకు వారు నిరాకరించారు. దీంతో కనిమొళి అక్కడే బైఠాయించి ధర్నా చేసింది. సమాచారంతో పెన్నడం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కనిమొళితో మాట్లాడారు. జానకిరామన్‌తో వివాహం చేసే వరకు కదలనని అక్కడే పోరాటం చేస్తోంది. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
బాధిత యువతి వికలాంగురాలు అండగా నిలిచిన జాగృతి మహిళా మండలి సభ్యులు నకిరేకల్(నల్గొండ): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. ఈ సంఘటన నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామశివారులోని పాదువారిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లోని బొడ్రాయి బజార్లో నివాసముంటున్న పుల్లెంల ప్రియాంక వికలాంగురాలు. ఈ ఏడాదే సూర్యాపేటలో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె డిగ్రీ చదువుతున్నప్పుడు నకిరేకల్ మండలం చందుపట్లలోని పాదువారిగూడెంకు చెందిన నర్సింగ్ సందీప్ అనే యువకుడు నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఫలితంగా ఆ యువతి ప్రస్తుతం ఏడునెలల గర్భవతి. పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడని.. పెద్ద మనుషుల సమక్షంలో పంచారుుతీ పెట్టినా ఫలితం లేక పోయిందని వాపోయింది. దీంతో ఆ యువతి సూర్యాపేట జాగృతి మహిళా మండలిని ఆశ్రయించింది. దీనికి స్పందించిన మండలి అధ్యక్షురాలు గోపిక ఆధ్వర్యంలో ఆదివారం సందీప్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే సందీప్ కుటుంబీకులు ఇంటికి తాళం వేసి ఇంట్లో ఎవరూ లేకుండా పోయూరు. ఈ నిరసన కార్యక్రమంలో జాగృతి మహిళా మండలి ప్రతి నిధులు బాదిని నాగమణి, కుంచం గోపమ్మ, ఎం.నాగమణి తదితరులు ఉన్నారు. -
పెళ్లి అనగానే మాట మార్చాడు..!
విశాఖపట్నం: ప్రేమికుడి మాయ మాటలు నమ్మి మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతోంది. మోసానికి పాల్పడిన వంచకుడు మాత్రం మరో యువతితో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ప్రేమించానని మోసం చేసిన వ్యక్తితోనే తన పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరుతూ ఆ యువతి గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద బంధువులతో కలిసి మంగళవారం ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే... స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఒక మహిళ కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తె (21)ని డిగ్రీ వరకు చదివించింది. సమీప బంధువు, ఆటో డ్రైవర్ చిల్ల దుర్గారెడ్డి ప్రేమిస్తున్నానని నమ్మించి స్వాతికి దగ్గరయ్యాడు. మాయమాటలతో లోబరుచుకోవడంతో యువతి గర్భం దాల్చింది. ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని దుర్గారెడ్డిపై ఒత్తిడి తెచ్చింది. సరేనని చెప్పిన దుర్గారెడ్డి బలం మాత్రల పేరుతో అబార్షన్ మాత్రలను ఇచ్చాడు. వాటిని వినియోగించడంతో స్వాతికి తీవ్ర కడుపునొప్పి, ఆ తర్వాత రక్తస్రావమయింది. అనంతరం గత నెల 29న తెల్లవారి 3 గంటలకు బాత్రూమ్కు వెళ్లిన స్వాతి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ విషయం కుటుంబ సభ్యులతో చెప్పకుండా తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లిని, సోదరుడిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది. తర్వాత ఇంటికి తిరిగొచ్చిన స్వాతి సోదరుడు బాత్రూమ్లో ఆడ శిశువును చూసి నగరంలోని కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ శిశువు మృతి చెందింది. దీంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది. వివాహం చేసుకుంటానని మోసం ఆ సమయంలో తల్లిదండ్రులతో ఆస్పత్రికి వచ్చి యువతిని పరామర్శించిన దుర్గారెడ్డి ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. సాయంత్రానికి తిరిగి వస్తానన్న వ్యక్తి ఫోన్ చేసి వివాహం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మృత శిశువుతో చిల్లపేట వెళ్లినప్పటికీ మోసగాడి ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో బాధితురాలు మృత శిశువుతోనే ఆందోళనకు దిగింది. దీంతో అక్కడి పెద్దలు లక్ష రూపాయలు తీసుకుని విషయాన్ని మరిచిపోవాలని స్వాతికి సూచించారు. ఇక అక్కడ న్యాయం జరగదని భావించిన బాధితురాలు గాజువాక పోలీసులను ఈ నెల 1న ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పేరుతో రెండు వారాలుగా కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నెల 18న మరో యువతితో దుర్గారెడ్డికి వివాహం జరగనుండటంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. ఫిర్యాదు ఇచ్చినప్పుడు విచారణ కోసం వచ్చిన మోసగాడిని కూడా పోలీసులు విడిచి పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు మాత్రం దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఎప్పటి మాదిరిగానే హామీ ఇచ్చి బాధితురాలిని పంపించేశారు. ఈ విషయంపై ఎస్ఐ అప్పలరాజును సంప్రదించగా నిందితుడిని పట్టుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాము వెళ్లిన ప్రతిసారీ నిందితుడు పరారవుతున్నాడని పేర్కొన్నారు. -
ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి శవం ...
నల్గొండ: ప్రేమించిన అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న వారు ప్రేమికుడి ఇంటి ముందే శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ సంఘటన శనివారం నల్గొండ జిల్లా చౌచటుప్పల్ మండలం తాళ్ల సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికల కథనం ప్రకారం.... తాళ్ల సింగారం గ్రామానికి చెందిన నల్ల వసంత(21), ఎర్రగాని రమేష్ (24)లు ఓ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇంటిలో తెలియడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇరువురి కుటుంబాలు వీరి వివాహం చేసేందుకు అంగీకరించారు. అయితే ప్రేమికుడు రమేష్‌కు అన్న ఉన్నాడు. దాంతో అతడికి వివాహాం చేసిన తర్వాతే రమేష్ వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కాగా శుక్రవారం వసంత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు రమేష్ వేధింపులు భరించలేకే చనిపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని శనివారం రమేష్ ఇంటి ముందే పూడ్చిపెట్టారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనపోరాటం
ఇల్లెందుఅర్బన్,న్యూస్‌లైన్: ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని 21 పిట్ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాయకులగూడేనికి చెందిన కిన్నెర వసంత, 21 పిట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ సింగారపు నవీన్ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. 21 పిట్ఏరియాలో వసంత టైలరింగ్ నేర్చుకుంటున్న క్రమంలో వారిరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి వసంతను లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని వసంత కోరడంతో వాయిదాలు వేస్తూ తప్పిం చుకు తిరుగుతున్నాడు. ఆరు నెలల క్రితం మకాం వరంగల్‌కు మార్చాడు. అప్పటి నుంచి ఇంటికి తాళం వేసి ఉంటోంది. విషయం తెలుసుకున్న వసంత రోజూ ఫోన్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అనుమానం వచ్చిన బాధితురాలు పెద్ద మనుషులను ఆశ్రయించినా ఫలితంలేకుండాపోయింది. దీంతో విసిగి వేసారిన బాధితురాలు బుధవారం న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. ఆమె ఆందోళనకు తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంనర్సింహరావు మద్దతు పలికారు. వసంత న్యాయం జరిగేంత వరకు తాము కూడా ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.