ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి శవం ... | Girlfriend last rituals infront of boyfriend house | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి శవం ...

Published Sat, Mar 7 2015 6:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి శవం ...

ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి శవం ...

నల్గొండ: ప్రేమించిన అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న వారు ప్రేమికుడి ఇంటి ముందే శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ సంఘటన శనివారం నల్గొండ జిల్లా చౌచటుప్పల్ మండలం తాళ్ల సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికల కథనం ప్రకారం.... తాళ్ల సింగారం గ్రామానికి చెందిన నల్ల వసంత(21), ఎర్రగాని రమేష్ (24)లు ఓ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇంటిలో తెలియడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇరువురి కుటుంబాలు వీరి వివాహం చేసేందుకు అంగీకరించారు.

అయితే ప్రేమికుడు రమేష్‌కు అన్న ఉన్నాడు. దాంతో అతడికి వివాహాం చేసిన తర్వాతే రమేష్ వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కాగా శుక్రవారం వసంత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు రమేష్ వేధింపులు భరించలేకే చనిపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని శనివారం రమేష్ ఇంటి ముందే పూడ్చిపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement