ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
బాధిత యువతి వికలాంగురాలు
అండగా నిలిచిన జాగృతి మహిళా మండలి సభ్యులు
నకిరేకల్(నల్గొండ): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. ఈ సంఘటన నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామశివారులోని పాదువారిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లోని బొడ్రాయి బజార్‌లో నివాసముంటున్న పుల్లెంల ప్రియాంక వికలాంగురాలు. ఈ ఏడాదే సూర్యాపేటలో డిగ్రీ పూర్తి చేసింది.
ఈమె డిగ్రీ చదువుతున్నప్పుడు నకిరేకల్ మండలం చందుపట్లలోని పాదువారిగూడెంకు చెందిన నర్సింగ్ సందీప్ అనే యువకుడు నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఫలితంగా ఆ యువతి ప్రస్తుతం ఏడునెలల గర్భవతి. పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడని.. పెద్ద మనుషుల సమక్షంలో పంచారుుతీ పెట్టినా ఫలితం లేక పోయిందని వాపోయింది.
దీంతో ఆ యువతి సూర్యాపేట జాగృతి మహిళా మండలిని ఆశ్రయించింది. దీనికి స్పందించిన మండలి అధ్యక్షురాలు గోపిక ఆధ్వర్యంలో ఆదివారం సందీప్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే సందీప్ కుటుంబీకులు ఇంటికి తాళం వేసి ఇంట్లో ఎవరూ లేకుండా పోయూరు. ఈ నిరసన కార్యక్రమంలో జాగృతి మహిళా మండలి ప్రతి నిధులు బాదిని నాగమణి, కుంచం గోపమ్మ, ఎం.నాగమణి తదితరులు ఉన్నారు.