కొమ్మాయిగూడెంలో ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న ప్రసన్న
రామన్నపేట (నకిరేకల్) : ప్రేమించిన యువకుడితోనే వివాహం జరిపించాలని యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఆదివారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాయిగూడెం గ్రామానికి చెం దిన వీరమల్ల ప్రసన్న, అదేగ్రామానికి చెందిన రేపాక గణేశ్‌లు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించు కుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు.
పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల గణేశ్‌కు వేరే యువతితో వివాహం కుదిరింది. విష యం తెలుసుకున్న యువతి రామన్నపేట పోలీ స్‌స్టేషన్‌లో గణేశ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుం టానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని అతడిపై ఈనెల 16న రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు, గ్రామపెద్దలు ఇద్దరికీ పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. యువకుడు గణేశ్ ప్రసన్న తనకు సోదరితో సమానమని బుకాయించసాగాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయువతి గణేశ్‌తో వివా హం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివా రం కొమ్మాయిగూడెంలో అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.
ఆమెకు గ్రామస్తులు, బంధువులు మద్దతు పలికారు. కుటుంబసభ్యులు అక్కడే వంటచేసుకుని భుజించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సీహెచ్ సాయిలు యు వతి ధర్నా చేస్తున్న ఇంటివద్దకు వెళ్లి ఆమెతో మా ట్లాడారు. మోసంచేసిన యువకుడిపై ఫిర్యాదుచేస్తే కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. తనను ప్రేమించాలని చాలా కాలం వేధించాడని, కులాలు వేరైనా పెద్దలు అంగీకరించక పోయినా తప్పకుండా పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి గణేశ్ తనను మోసం చేశాడని, మధ్యలో తనకు వివాహ సంబంధాలు వచ్చినా చేసుకోనీ యలేదని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. కట్నం డబ్బులకు ఆశపడి తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. అతనితో తన వివాహం జరిపించాలని వేడుకున్నది. జీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇచ్చిన యువతి ఆందోళన విరమించలేదు.
Comments
Please login to add a commentAdd a comment