అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు జిల్లాలోని 63 మండలాల్లో వర్షం కురిసింది. 40 మండలాల్లో చెప్పుకోదగ్గ వర్షం పడటంతో ఒకే రోజు 14.4 మి.మీ సగటు నమోదైంది.
తాడిమర్రి మండలంలో 40.9 మి.మీ, విడపనకల్ 39.2 మి.మీ, బత్తలపల్లి 35.6 మి.మీ, గుమ్మగట్ట 33.6 మి.మీ, నార్పల 33.3 మి.మీ, పెద్దవడుగూరు 27.2 మి.మీ, నల్లమాడ 26.9 మి.మీ, పుట్టపర్తి 25.9 మి.మీ, రాయదుర్గం 25.6 మి.మీ, కదిరి 23.5 మి.మీ, బుక్కపట్టణం 23.3 మి.మీ, తలుపుల 23.2 మి.మీ, కనేకల్లు 22 మి.మీ, బుక్కరాయసముద్రం 20.8 మి.మీ, కనగానపల్లి 20.4 మి.మీ, చెన్నేకొత్తపల్లి 19.6 మి.మీ, యల్లనూరు 19 మి.మీ, తాడిపత్రి 18.9 మి.మీ, పుట్లూరు 18.8 మి.మీ, బెళుగుప్ప 18.6 మి.మీ, సోమందేపల్లి 17.8 మి.మీ, పెనుకొండ 17.5 మి.మీ, ముదిగుబ్బ 17.5 మి.మీ, ధర్మవరం 17.5 మి.మీ, రాప్తాడు 16.5 మి.మీ, ఓడీ చెరువు 15.8 మి.మీ, రామగిరి 14.6 మి.మీ, చిలమత్తూరు 14.2 మి.మీ, రొద్దం 14.1 మి.మీ, గాండ్లపెంట 14.1 మి.మీ, శింగనమల 13.4 మి.మీ, ఎన్‌పీ కుంట 12.2 మి.మీ, కంబదూరు 12.1 మి.మీ, తనకల్లు 11.3 మి.మీ, గోరంట్ల 10.9 మి.మీ బ్రహ్మసముద్రం 10.3 మి.మీ, గుడిబండ 10.2 మి.మీ వర్షం కురిసింది.
మిగతా మండలాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 129.9 మి.మీ నమోదైంది. మొత్తమ్మీద జూన్ ఒకటి నుంచి 277.6 మి.మీ వర్షం పడాల్సివుండగా 14 శాతం ఎక్కువగా 316.9 మి.మీ కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు పచ్చదనం సంతరించుకున్నాయి. పట్టు, పశుపోషణ, పశుగ్రాసం, పండ్లతోటలకు ఊరటనిస్తున్నాయి.
40 మండలాల్లో వర్షం
Published Sun, Sep 17 2017 10:40 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM
Advertisement