అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు 43 మండలాల్లో వర్షం పడింది. 10.9 మి.మీ సగటు నమోదైంది. కళ్యాణదుర్గం డివిజన్‌లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కళ్యాణదుర్గం 67.2 మి.మీ, శెట్టూరు 51.4 మి.మీ, కుందుర్పి 37.4 మి.మీ, బుక్కపట్నం 36.2 మి.మీ, ఆత్మకూరు 31.8 మి.మీ, ధర్మవరం 31.6 మి.మీ, యల్లనూరు 28.4 మి.మీ, చెన్నేకొత్తపల్లి 26.2 మి.మీ, రామగిరి 25.4 మి.మీ, పెనుకొండ 25.2 మి.మీ, ఓడీ చెరువు, కొత్తచెరువు 21.2 మి.మీ, రొద్దం 20.2 మి.మీ, గాండ్లపెంట 19.8 మి.మీ, ముదిగుబ్బ 19.4 మి.మీ, ఎన్‌పీ కుంట 18 మి.మీ, నల్లమాడ 17 మి.మీ, బుక్కపట్నం 16.4 మి.మీ, కంబదూరు 16.2 మి.మీ, పుట్టపర్తి 15.4 మి.మీ, శింగనమల 14.6 మి.మీ, వజ్రకరూరు 12.2 మి.మీ, బ్రహ్మసముద్రం, పామిడిలో 11 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 115.6 మి.మీ నమోదైంది. చాలా మండలాల్లో వాగులు, వంకలు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. అక్కడక్కడ చెరువుల్లోకి నీరు చేరింది. ఖరీఫ్ ప్రధాన పంటలు, ప్రత్యామ్నాయ పంటల స్థితిగతులు ప్రస్తుతానికి ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.