విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ మూడు రోజులే సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఎప్పటిలా కాకున్నా.. కనీసం ఐదు రోజులైనా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల చేసిన వినతులను ప్రభుత్వం పట్టించుకోలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల రెండు నెలల పాటు పాఠశాలలు మూతపడ్డారుు. దీంతో సెలవుదినాలు, ఆదివారాల్లో కూడా ఉపాధ్యాయులు పాఠశాలలను నడుపుతున్నారు. ఈనేపథ్యంలో సంక్రాంతికి కనీసం ఐదు రోజులైనా... సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ పంఘాలు కోరినా... ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడు రోజులు మాత్రమే సెలవుల తీసుకోవాలని ఖరాకండిగా నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఈ విషయమై డీఈఓ జి. కృష్ణారావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ ఇచ్చిన ఉత్తర్శుల మేరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా పరిగణిస్తామన్నారు. దీనిపై ఎటువంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు.
సంక్రాంతి సెలవులు మూడు రోజులే!
Published Thu, Jan 9 2014 3:27 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement
Advertisement