'బాహుబలి-2' పై యంగ్ హీరో ఏమన్నాడంటే.. | Baahubali 2 was so good, tweets Manoj Manchu | Sakshi
Sakshi News home page

'బాహుబలి-2' పై యంగ్ హీరో ఏమన్నాడంటే..

Published Fri, Apr 28 2017 7:49 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

'బాహుబలి-2' పై యంగ్ హీరో ఏమన్నాడంటే..

'బాహుబలి-2' పై యంగ్ హీరో ఏమన్నాడంటే..

హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి: ది కన్‌క్లూజన్'ను తొలిరోజు చూడాలని సాధారణ అభిమానులతో సహా టాలీవుడ్ నటులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ భార్య ప్రణతితో కలసి ఐనాక్స్ నాలుగో స్కీన్‌పై బాహుబలిని వీక్షించారు. అనంతరం ఆ వివరాలను ట్వీట్ చేశారు. 'బాహుబలి-2 చాలా బాగుంది. సినిమాను మళ్లీ చూస్తాను. బాహుబలి టీ షర్ట్ ధరించి తర్వాతి షోలో బాహుబలి-2ను మరోసారి వీక్షిస్తానని' ట్వీట్లో రాసుకొచ్చారు మనోజ్.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు టాలీవుడ్ నటులు, ఇతర ప్రముఖులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. శుక్రవారం దేశంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన మూవీగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్' రికార్డులు సృష్టించింది. బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement