'బాహుబలి' ప్రభాస్ మీద అభిమానంతో.. | women fans wears love u prabhas baahubali tea shirts | Sakshi
Sakshi News home page

'బాహుబలి' ప్రభాస్ మీద అభిమానంతో..

Published Fri, Apr 28 2017 6:55 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

women fans wears love u prabhas baahubali tea shirts

ముంబై: టాలీవుడ్‌ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌలి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'బాహుబలి: ది కన్‌క్లూజన్' శుక్రవారం రికార్డు థియేటర్లలో విదులై ప్రభంజనం సృష్టిస్తోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సస్పెన్స్‌ నుంచి బయటపడేందుకు దేశవ్యాప్తంగా బాహుబలి అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. 'డార్లింగ్' ప్రభాస్‌కు ముంబైలోనూ మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్నారన్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో బాహుబలి టీ షర్ట్స్ ధరించి లేడిస్ ఫ్యాన్స్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

'వి లవ్ ప్రభాస్ బాహుబలి' అని రాసి ఉన్న బ్లాక్ టీషర్ట్స్ ధరించి కాలేజీ విద్యార్థినులు, యువతులు తొలి రోజే బాహుబలి-2 చూడాలని థియేటర్లకు భారీ ఎత్తున తరలి వస్తుండటంతో సందడి వాతావరణం ఏర్పడింది. టికెట్లు దొరకడం కష్టంగా ఉన్నా.. ప్రభాస్ మీద అభిమానంతోనే థియేటర్లకు క్యూ కడుతున్నారు. నేడు విడుదలైన బాహుబలి-2 ఫస్ట్‌ హాఫ్‌ సూపర్ గా ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిని మించిపోయేలా ఉన్నాయని పాజిటీవ్ టాక్ వస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement