'నేను గ్లామర్గా కనిపిస్తేనే మా అత్తకు ఇష్టం' | My mother-in-law likes to see me in glamorous roles: Kareena | Sakshi
Sakshi News home page

'నేను గ్లామర్గా కనిపిస్తేనే మా అత్తకు ఇష్టం'

Published Tue, Jun 23 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

'నేను గ్లామర్గా కనిపిస్తేనే మా అత్తకు ఇష్టం'

'నేను గ్లామర్గా కనిపిస్తేనే మా అత్తకు ఇష్టం'

ముంబై: కరీనా కపూర్ గ్లామర్ పాత్రల్లో కనిపిస్తేనే ఆమె అత్త, అలనాటి నటి షర్మిల ఠాగూర్కు ఇష్టమట. ఈ విషయాన్ని కరీనాయే చెప్పింది. షర్మిల కొడుకు, హీరో సైఫ్ అలీఖాన్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

'మా అత్త షర్మిలకు నన్ను గ్లామర్ పాత్రలో చూడటానికే ఇష్టపడతారు. దబాంగ్ 2 చిత్రంలో నేను చేసిన ఫెవికాల్ ఐటమ్ సాంగ్ ఆమెకు చాలా ఇష్టం. ఈ పాట, నా డాన్స్ అంటే ఎంతో ఇష్టం. నేను సెక్సీ, గ్లామర్గా కనిపించాలని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు' అని కరీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. షర్మిల తనకు స్ఫూర్తి అని కరీనా చెప్పారు. పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా షర్మిల చిత్రం రంగంలో కొనసాగారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement