glamorous role
-
గ్లామర్ పాత్రలు రావడం లేదు: ‘శశి’ హీరోయిన్
‘‘శశి’ చిత్రనిర్మాతలు మొదట నాకు ఫోన్ చేసి కథ వినమన్నారు. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్ వచ్చి మూడు గంటలు ‘శశి’ కథ చెప్పారు. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యి నటించేందుకు ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ సురభి అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురభి విలేకరులతో మాట్లాడుతూ -‘‘శశి’ రెగ్యులర్ ప్రేమకథా చిత్రం కాదు. అన్ని రకాల అంశాలున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తల్లితండ్రులు, కూతురు మధ్య ఉన్న ప్రేమను ఈ చిత్రంలో బాగా చూపించారు. నిజ జీవితంలోనూ నా తల్లితండ్రులకు నేనొక్కదాన్నే కావడంతో శశి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. కూతురు పట్ల ఓ తండ్రి ఎంత రక్షణగా, బాధ్యతగా ఉంటాడన్నది ఆకట్టుకుంటుంది. నా తండ్రి పాత్రలో రాజీవ్ కనకాలబాగా నటించారు. ఈ సినిమాలో ఆది పాత్ర రగ్డ్గా ఉంటుంది. తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. నేను కూడా రెండు వేరియేషన్స్‌లో నటించడం కొత్తగా అనిపించింది. గ్లామర్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ‘ఓటర్’ సినిమాలో నాది గ్లామర్ పాత్రే. ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. ‘శశి’ సినిమా విడుదల తర్వాత నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నాను. తమిళంలో చేస్తుండడం వల్ల తెలుగులో ఎక్కువగా చేయలేకపోయా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా. తమిళంలో 3 సినిమాలు చేస్తున్నాను. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నా. గోల్డెన్ స్టార్ గణేష్‌తో నటిస్తున్నాను’’ అన్నారు. -
మరోసారి బోల్డ్ పాత్రలో...
హోమ్లీ పాత్రల్లోనే కాదు.. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్ రోల్లో నటించడానికి వెనకాడరు అమలాపాల్. ఆ మధ్య ‘ఆమె’ చిత్రంలో బోల్డ్‌గా నటించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారామె. తాజాగా మరోసారి ఓ బోల్డ్ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారట. అయితే సినిమాలో కాదు.. ఓ వెబ్ సిరీస్ కోసం కావడం విశేషం. 1970ల నాటి కథతో తెలుగు, తమిళ భాషల్లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో అమలాపాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్లో మహేష్ భట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారు. దీని ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అమలాపాల్. -
గ్లామరస్ పాత్రలో లక్ష్మీమీనన్
యువతుల దుస్తుల్లో లంగా, ఓణీలనేవి ప్రస్తుతం గ్రామాలకే పరిమితం(అక్కడ కూడా అరుదుగానే)అయ్యి పోయాయని చెప్పవచ్చు.అలాంటిది ఇక మన కథానాయికలు మాత్రం ధరించడానికి ఎలా ఇష్టపడతారు చెప్పండి. యువ నటి లక్ష్మీమీనన్‌కు లంగా ఓణీలు ధరించి బోర్ కొట్టేసిందంటున్నారు. కుంకీ చిత్రంలో కొండవాసి పడుచుగా పరిచయమైన ఈ కేరళ కుట్టి అప్పటి నుంచి తాను నటించిన చిత్రాల్లో అధిక శాతం లంగా ఓణీతోనే కనిపించి మురిపించారు. కాగా వరుస విజయాలతో దూసుకొచ్చిన లక్ష్మీమీనన్ వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలుగా నటించారు. అయినా నటిగా మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత మిరుదన్ చిత్రంలో జయంరవికి జంటగా నటించారు.ఆ చిత్రం బాగానే ప్రజాదరణ పొందింది. కానీ అవకాశాలు రాకో, వచ్చిన వాటిని తను అంగీకరించకో అమ్మడికి చిన్న గ్యాప్ వచ్చింది. దీంతో ప్రైమ్‌టైమ్‌లో ప్లేస్‌ను కోల్పోయారు. తాజాగా లైమ్‌టైమ్‌లోకి వచ్చారు. కారణం సక్సెస్ఫుల్ నటుడు విజయ్‌సేతుపతికి జంటగా రెక్క చిత్రంలో నటించే అవకాశాన్ని పొందడమే కావచ్చు. వా డీల్ చిత్రం ఫేమ్ రతన్‌శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మదురైలో జరిగిన షూటింగ్‌తో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. విశేషం ఏమిటంటే ఇందులో లక్ష్మీమీనన్ తొలిసారిగా గ్లామరస్ పాత్రను పోషిస్తున్నారట. పాత్ర బాగా నచ్చడంతో ఇష్టపడి మరీ నటిస్తున్నారట. అంతేకాదు ఇకపై లంగా, ఓణీ పాత్రలకు దూరం అంటున్నారని సమాచారం. అయితే తన ఈ మాటపై లక్ష్మీమీనన్ ఎంతవరకు నిలబడతారో వేచి చూడాల్సిందే. -
రూటు మార్చిన త్రిష
ఇవాళ గ్లామర్ పేరుతో కుటుంబ సమేతంగా చూడడానికి సిగ్గు పడే విధంగా అసలు దుస్తులు ధరించారా? అని సందేహం కలిగేలా హీరోయిన్లు నటించడానికి వెనుకాడడం లేదు. అయితే ఈ విషయంలో వారిని మాత్రమే తప్పు పట్టడానికి వీలులేదు. వ్యాపారాత్మక దృక్పథంలో దర్శక నిర్మాతల ఒత్తిడి ఉంటుందని చెప్పక తప్పదు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే నటి త్రిష గ్లామరస్ పాత్రల్లో విజృంభించి నటించిన సందర్భాలున్నాయి.అయితే ఇటీవల ఈ చెన్నై చిన్నది తన ధోరణిని మార్చుకున్నారట. ఆ మధ్య నటించిన అరణ్మణై-2 చిత్రంలో హన్సిక,పూనం బాజ్వాలతో పోటీ పడి అందాలారబోశారు. దీంతో అలాంటి అవకాశాలు మరిన్ని తలుపు తట్టడంతో ఇక లాభం లేదనుకుని తన రూటు మార్చారట. అయితే అంతకు ముందే తూంగావనం లాంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసు చూరగొన్నారు. అందువల్ల ఇకపై అతి గ్లామర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం త్రిష నాయకి అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈ బ్యూటీ నాటి నటీమణులు కాంచన, వాణిశ్రీలను గుర్తుకు తెచ్చేలా మెడ నుంచి కాలు వరకూ దుస్తులు ధరించి నటిస్తున్నారు. శ్రుతి మించిన గ్లామర్ పాత్రలు చేయడం ఇష్టం లేకే తన రూటును మార్చుకున్నట్లు త్రిష పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రలు అయితేనే నటించడానికి అంగీకరిస్తానని త్రిష చెబుతున్నట్లు సమాచారం. -
'నేను గ్లామర్‌గా కనిపిస్తేనే మా అత్తకు ఇష్టం'
ముంబై: కరీనా కపూర్ గ్లామర్ పాత్రల్లో కనిపిస్తేనే ఆమె అత్త, అలనాటి నటి షర్మిల ఠాగూర్‌కు ఇష్టమట. ఈ విషయాన్ని కరీనాయే చెప్పింది. షర్మిల కొడుకు, హీరో సైఫ్ అలీఖాన్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'మా అత్త షర్మిలకు నన్ను గ్లామర్ పాత్రలో చూడటానికే ఇష్టపడతారు. దబాంగ్ 2 చిత్రంలో నేను చేసిన ఫెవికాల్ ఐటమ్ సాంగ్ ఆమెకు చాలా ఇష్టం. ఈ పాట, నా డాన్స్ అంటే ఎంతో ఇష్టం. నేను సెక్సీ, గ్లామర్‌గా కనిపించాలని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు' అని కరీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. షర్మిల తనకు స్ఫూర్తి అని కరీనా చెప్పారు. పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా షర్మిల చిత్రం రంగంలో కొనసాగారని అన్నారు. -
నాకు నేనే పోటీ
‘‘నాకెప్పుడూ నంబర్ గేమ్స్ మీద ఆసక్తి ఉండదు. నంబర్ శాశ్వతం కాదు. ప్రేక్షకుల అభిమానమే శాశ్వతం. అందుకే, వాళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తాను’’అని విద్యాబాలన్ అంటున్నారు. అటు హోమ్లీ పాత్రలకు, ఇటు పూర్తిస్థాయి గ్లామరస్ పాత్రలకు విద్య పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. పాత్ర డిమాండ్ చేస్తే, ఎలాంటి పాత్రకైన పూర్తి న్యాయం చేయడానికి కృషి చేస్తారామె. ఆ విషయం గురించి విద్యాబాలన్ చెబుతూ -‘‘ఏ సినిమాలో అయినా నా పాత్ర పరిధి మేరకు నటించడానికి వంద శాతం కృషి చేస్తాను. కొన్ని సినిమాలు సరిగ్గా ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. జయాపజయాల ప్రభావం నా తర్వాతి చిత్రాల మీద ఉండదు. సినిమా ఫెయిల్ అయినా, నటిగా విద్య ఫెయిల్ కాలేదంటారు. ఆ సంగతలా ఉంచితే, కొంతమంది ‘పోటీలో ఉన్న తారలు వరుసగా సినిమాలు చేస్తూ, దూసుకెళుతున్నారు.. మీరేమో సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. నేనెవరికీ పోటీ కాదు. నాకు నేనే పోటీ’’ అని జవాబిచ్చారు. -
థ్రిల్ అవుతారు
గ్లామరస్ రోల్స్కన్నా డీ-గ్లామరస్ రోల్స్ చేయడం కొంచెం కష్టం. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న పాత్రలు చేయాలంటే ఆ ఆర్టిస్ట్‌కి ఎంతో సామర్థ్యం ఉండాలి. ‘నేను దేవుడ్ని’ చిత్రంలో అంధురాలి పాత్రను అద్భుతంగా పోషించారు పూజ. తమిళంలో ఆమె కథానాయికగా నటించిన ‘విడియుమ్ మున్’ అనే చిత్రం తెలుగులో విడుదల కానుంది. సిల్వర్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్, ఖయ్యూం స్టూడియోస్ సమర్పణలో అల్తాఫ్ అహ్మద్, జావేద్ అనువదిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర చూసి థ్రిల్ అవుతారని పూజా అన్నారు. అల్తాఫ్ అహ్మద్ మాట్లాడుతూ -‘‘తమిళంలోలా తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ప్రభాకర్, దర్శకత్వం: బాలాజి కె. కుమార్. -
అందాల ఆరబోతకు నయనతార రెడీ!
అందాల ఆరబోతకు నయనతార వెనకాడడం లేదు. ఈ క్రేజీ హీరోయిన్ ఇంతకముందు చాలా చిత్రాలలో గ్లామరస్‌గా నటించింది. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాజాగా నటిస్తున్న అనామిక చిత్రంలో మరింత గ్లామరస్‌గా కనిపించనుందట. తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న అనామిక కు బాలీవుడ్లో విశేష ప్రజాదరణ పొందిన కహాని చిత్రం ఆధారం. హిందీలో విద్యాబాలన్ హీరోయిన్. భర్త కోసం వెతుకుతున్న గర్భిణి పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళభాషల్లో తెరకెక్కించడానికి శేఖర్ కమ్ముల నిర్ణయిచారు. హీరోయిన్ పాత్రకు నయన్‌ను ఎంపిక చేశా రు. జాతీయ అవార్డే లక్ష్యంగా నయనతార ఈ చిత్రంలో నటిస్తోందట. అదే సమయంలో అందాల ఆరబోత శ్రుతి మించిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. యూనిట్ సభ్యులను బయటకు పంపించి మరీ గ్లామరస్ సన్నివేశాలను తెరకెక్కించారని టాక్. మొత్తం మీద నయనతారను ప్రేక్షకులు మరోమారు గ్లామర్ పాత్రలో చూడనున్నారు.