నాకు నేనే పోటీ | Never subscribed to number game: Vidya Balan | Sakshi
Sakshi News home page

నాకు నేనే పోటీ

Published Mon, Jun 8 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

నాకు నేనే పోటీ

నాకు నేనే పోటీ

 ‘‘నాకెప్పుడూ నంబర్ గేమ్స్ మీద ఆసక్తి ఉండదు. నంబర్ శాశ్వతం కాదు. ప్రేక్షకుల అభిమానమే శాశ్వతం. అందుకే, వాళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తాను’’అని విద్యాబాలన్ అంటున్నారు. అటు హోమ్లీ పాత్రలకు, ఇటు పూర్తిస్థాయి గ్లామరస్ పాత్రలకు విద్య పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అవుతారు. పాత్ర డిమాండ్ చేస్తే, ఎలాంటి పాత్రకైన పూర్తి న్యాయం చేయడానికి కృషి చేస్తారామె. ఆ విషయం గురించి విద్యాబాలన్ చెబుతూ -‘‘ఏ సినిమాలో అయినా నా పాత్ర పరిధి మేరకు నటించడానికి వంద శాతం కృషి చేస్తాను.

 కొన్ని సినిమాలు సరిగ్గా ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. జయాపజయాల ప్రభావం నా తర్వాతి చిత్రాల మీద ఉండదు. సినిమా ఫెయిల్ అయినా, నటిగా విద్య ఫెయిల్ కాలేదంటారు.     ఆ సంగతలా ఉంచితే, కొంతమంది ‘పోటీలో ఉన్న తారలు వరుసగా సినిమాలు చేస్తూ, దూసుకెళుతున్నారు.. మీరేమో సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. నేనెవరికీ పోటీ కాదు. నాకు నేనే పోటీ’’ అని జవాబిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement