కలల రాణి...
‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ థఊ...’ (‘నా కలల రాణీ నువ్వెప్పుడొస్తావ్..’ అని అర్థం) అంటూ ప్రేయసి షర్మిలా ఠాగూర్‌ని ఉద్దేశించి ‘ఆరాధన’ చిత్రంలో రాజేశ్ ఖన్నా పాడే పాటను మర్చిపోవడం అంత సులువు కావు. లవ్ సాంగ్స్‌లో ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచిన వాటిల్లో ఈ పాటది అగ్రస్థానం. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే... ‘ఎలి’ (ఎలుక అని అర్థం) అనే తమిళ చిత్రం కోసం ఈ పాటను రీమిక్స్ చేశారని సమాచారం. విశేషం ఏంటంటే.. హాస్యనటుడు వడివేలుతో కలిసి నటి సదా ఈ పాటకు కాలు కదిపారు.
అదేంటీ అనుకుంటున్నారా? ఈ కామెడీ హీరో, సదా జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. వారిద్దరూ పాల్గొనగా ఇటీవల ఈ పాటను చిత్రీకరించారట. యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.