మావాడు ఆ సినిమాలు చేయడం సరికాదు | Saifs choice of films hasn't been good | Sakshi
Sakshi News home page

మావాడు ఆ సినిమాలు చేయడం సరికాదు

Published Fri, May 13 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

మావాడు ఆ సినిమాలు చేయడం సరికాదు

మావాడు ఆ సినిమాలు చేయడం సరికాదు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన బుల్లెట్ రాజా, హమ్షకల్స్, హ్యాపీ ఎండింగ్, ఫాంటమ్ తదితర సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. సైఫ్ సినిమాలపై అతని తల్లి, ఒకప్పటి హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా సైఫ్ సినిమాల ఎంపిక సరిగా లేదని షర్మిల అంది.

జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ తనకు కూతురు వంటిదని చెప్పింది. సైఫ్, కరీనాల్లో బెస్ట్ యాక్టర్ ఎవరన్నప్రశ్నకు.. 'ఇద్దరూ మంచి నటులే' అంటూ నవ్వుతూ సమాధానిమిచ్చింది. ఒకప్పుడు బాలీవుడ్లో అగ్రశ్రేణి హీరోయిన్గా వెలుగొందిన షర్మిల.. టీమిండియా మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీని వివాహం చేసుకుంది. తన భర్తతో గడిపిన క్షణాలు చిరస్మరణీయమైనవని గుర్తు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement