
కేదార్‌నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీఖాన్ తనయ సారా అలీఖాన్ ‘సింబా’తో సూపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతేకాదు చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ కిడ్‌గా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో సారా నానమ్మ, పాత తరం హీరోయిన్ షర్మిలా ఠాగూర్ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
లైఫ్ టైమ్ అవార్డు అందుకునేందుకు ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన షర్మిలా ఠాగూర్ మాట్లాడుతూ... ‘ సారా సినిమాలు, ఇంటర్వ్యూలు చూశాను. తను పరిణతితో మాట్లాడుతోంది. అద్భుతంగా నటిస్తోంది. వృత్తి పట్ల తన అంకిత భావం అమోఘం. నిరాండంబరంగా ఉండేందుకే మొగ్గు చూపుతుంది. మానవత్వం గల వ్యక్తి. అయితే అన్నింటి కన్నా కూడా పెద్దల పట్ల సారాకున్న మర్యాద, వారితో ప్రవర్తించే తీరు నన్నెంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే సారాను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది’ అని మనవరాలిపై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా సారా... సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘లవ్ ఆజ్‌కల్2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సారాకు జంటగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment