అనారోగ్యంతో మంచానపడిన తండ్రిపై దాడి చికిత్సపొందుతూ మృతి
నరసరావుపేట రూరల్ : అనారోగ్యంతో మంచాన ఉన్న తండ్రిపై ఆస్తి వివాదం నేపథ్యంలో కొడుకు దాడి చేశాడు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన తండ్రి ప్రాణాలు విడిచాడు. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కృపారావు (70) కొంతకాలం క్రితం ఎకరం 20 సెంట్ల భూమి కోనుగోలు చేశాడు. ఆ తర్వాత పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఆ భూమిని తన పేరున రాయించుకునేందుకు కృపారావు కొడుకు ఏలియా పథకం పన్నాడు. తల్లి సోమమ్మకు మాయమాటలు చెప్పి భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. పాసు పుస్తకాల కోసం వీఆర్వోను సంప్రదించగా, విషయం కాస్తా తల్లికి తెలిసింది.
అప్పటి నుంచి తల్లిదండ్రులకు, కుమారుడికి మధ్య విభేదాలు వచ్చాయి. పెద్దలు ఇరువురికీ రాజీ చేసి 50 సెంట్లను తల్లికి ఇచ్చే విధంగా ఒప్పించారు. ఈ నెల 5వ తేదీన మరోమారు తల్లి, కుమారుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మంచ ంపై ఉన్న తండ్రి గొంతు మీద ఏలియా తన్నాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన కృపారావును గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. సోమమ్మ ఫిర్యాదుతో రూరల్ సీఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కొడుకు
Published Sat, Jan 9 2016 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement
Advertisement