మదనపల్లి (చిత్తూరు జిల్లా) : ఆస్తి తగాదాల కారణంగా తమ్ముడి భార్యపై అన్న దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అతనిపై నిర్భయ కేసు నమోదైంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి తాలుకా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. ఆస్తి తగాదాలతో మదనపల్లికి చెందిన నాగప్ప.. తమ్ముడు శ్రీనివాసులు భార్య ప్రమీలమ్మపై శనివారం రాత్రి దాడి చేశాడు.
ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయమై ఆదివారం మదనపల్లి పోలీసులకు శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. దీంతో శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు నాగప్పపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమ్ముడి భార్యపై అన్న దాడి
Published Sun, Aug 23 2015 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM
Advertisement