
న్యూఢిల్లీ : ఆస్తి కోసం కన్నతండ్రినే అత్యంత దారుణంగా హతమార్చాడో కొడుకు. అనంతరం అతడి శవాన్ని ముక్కలుగా నరికి తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఢిల్లీలోని షాదర ఏరియాలో చోటుచేసుకుంది. వివరాలు.. సందేశ్ అగర్వాల్(48) అనే వ్యక్తి ఫార్ష్ బజార్‌లో కాస్మొటిక్ షాప్ నడుపూతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఆస్తి మొత్తం తన పేరిట రాయాలని పెద్ద కొడుకు అమన్ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అమన్ తండ్రిని హత్య చేశాడు. అనంతరం అతడి శవాన్ని 25 ముక్కలుగా నరికి.. నాలుగు బ్యాగుల్లో ప్యాక్ చేశాడు. స్నేహితుల సహాయంతో మంగళవారం వాటిని తరలిస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తండ్రి తనను ఎప్పుడూ తిడుతుండటంతోనే హత్య చేశానని అమన్ చెప్పినట్లు పేర్కొన్నారు.
కాగా ఈ విషయం గురించి సందేశ్ సోదరుడు మాట్లాడుతూ..‘ ఆస్తి విషయంలో సందేశ్‌కు, అతడి భార్యాపిల్లలకు గొడవలు జరుగుతున్నాయి. సందేశ్ ఇప్పటికే తన ఆస్తిలో సగం వారి పేరిట రాశాడు. కేవలం ఒక్క షాపు మాత్రమే అతడి పేరుతో ఉంది. అయితే దానిని కూడా దక్కించుకునేందుకు వారు సందేశ్‌ను చంపేశారు. నెల రోజులుగా సందేశ్‌ను చంపుతానంటూ అమన్ బెదిరిస్తూనే ఉన్నాడు. సందేశ్ హత్యలో అతడి భార్య ప్రమేయం కూడా ఉంది. ఆస్తి కోసం నా తమ్ముడిని పొట్టనబెట్టుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment