కార్యకర్త కన్నెర్రజేస్తే... | karya katha is a bi-lingual movie | Sakshi
Sakshi News home page

కార్యకర్త కన్నెర్రజేస్తే...

Published Tue, Mar 4 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

karya katha is a bi-lingual movie

 రంగుల కల, గ్లామర్, అయ్యప్ప స్వామి, సర్దార్ చిత్రాల్లో బాలనటునిగా చేసిన మనీష్‌బాబు హీరోగా ‘కార్యకర్త’ సినిమా రూపొందనుంది. చిత్తజల్లు ప్రసాదనాయుడు దర్శకత్వంలో జనం ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఈ నెల ద్వితీయార్ధంలో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఒక పార్టీ ఎదుగుదలకు ముందుగా శ్రమించే వ్యక్తి కార్యకర్త.
 
 ఎలాంటి రాజకీయ చరిత్రకైనా పునాదిరాయి కార్యకర్త. అలాంటి కార్యకర్త కన్నెర్ర చేస్తే రాజకీయ నాయకుల చరిత్ర కాలి బూడిదైపోతుందనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధనుంజయ్, సమర్పణ: జి.ఆంజనేయులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement