karya kartha
-
బీజేపీ నేత దారుణ హత్య.. ఎక్కడినుంచి వచ్చారో గానీ రెప్పపాటులో..
పుదుచ్చేరిలో బీజేపీ నేత హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వ్యవహారాలను కార్యకర్త సెంథిల్ కుమారన్ చూసుకునేవాడు. దీంతో పాటు అతను రియల్ ఎస్టేట్ డీల్స్‌లో కూడా చురుకుగా పాల్గొంటూ ఇతర వ్యాపారాలను నడుపుతుండేవాడు. అయితే ఆదివారం రాత్రి కొందరు దుండగులు హఠాత్తుగా వచ్చి రెప్పపాటు సమయంలో బాంబు విసిరి, కుమారన్‌పై మారణాయుధాలతో దాడి చేసి నరికి చంపారు. విలియనూర్‌లోని కన్నకి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న బేకరీ దగ్గర నిలబడి ఉండగా ఈ ఘటనకు చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే కామారన్‌ని ప్రత్యర్థులు హత్య చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏడుగురు వ్యక్తులు ఈ హత్యకు సంబంధించి తిరుచ్చి కోర్టు ముందు లొంగిపోయినట్లు సమాచారం. -
గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్త కేసును చేధించిన పోలీసులు
-
‘వెంకట్ నారాయణ కేసులో టీడీపీ హైడ్రామా చేస్తోంది’
సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం బోయపాలెంలో గాయపడ్డ తెలుగుదేశం కార్యకర్త వెంకటనారాయణ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా క్రైమ్ డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి మాట్లాడుతూ.. కేసును పూర్తిస్థాయిలో విచారించాగా అందులో.. వెంకట్ నారాయణ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు లో కాపర్ వైర్ దొంగిలించే దొంగగా తేలిందన్నారు. అంతకు ముందే వెంకట్ నారాయణ పై 11 కాపర్ వైరు దొంగతనాలు కేసులు నమోదు కావాడంతో పాటు నాలుగు నెలల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు. బోయ పాలెం సమీపంలో వైజయంతి స్పిన్నింగ్ మిల్ లోని ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ ను దొంగతనం చేయడానికి ప్రయత్నించగా, దొంగతనం చేస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ రావడంతో కరెంట్ షాక్ తగిలి అతనికి గాయాలయ్యాయని చెప్పారు. ఆ స్పిన్నింగ్ మిల్లు వాచ్మెన్ 108కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారని తెలపారు. అయితే వెంకట్ నారాయణను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ హైడ్రామా చేస్తోందని, అతని పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి అతనిపై పెట్రోలు పోసి తగలబెట్టారంటూ తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఈ కేసును గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్ తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తను హతమార్చిన టీడీపీ వర్గీయులు
కొత్తూరు: మండలంలోని కుంటిబద్ర కాలనీకి చెందిన కామక జంగం(60)ను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి..కర్రలతో దాడిచేసి మంగళవారం హతమార్చారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటిభద్ర కాలనీకి చెందిన కామక జంగం వైఎస్సాసీపీ అభిమానిగా ఉంటున్నాడు. ఆయనతోపాటు అన్నదమ్ములు, వారి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి సానుభూతిపరులు. ఏప్రిల్‌లో జగిరిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అదే కాలనికి చెందిన కొవ్వాడ రాజు, యర్రయ్యలు చెప్పారు. జంగంతోపాటు ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి తాము వైఎస్సార్సీపీ వెంట ఉంటామని తెలియజేశారు. మాట వినలేదని కొవ్వాడ రాజు అప్పటి నుంచి కక్ష పెట్టుకుని చిన్న, చిన్న విషయాలకు కూడా తగాదాలకు దిగేవాడు. మంగళవారం జంగంకు చెందిన గడ్డివాము (కల్లంలో) దగ్గర పుట్టగొడుగులు మొలిశాయి. పుట్టగొడుగులు ఎందుకు తీశారని కొవ్వాడ రాజుతోపాటు ఆయన అన్నదమ్ములను జంగం నిలదీశారు. అప్పటికే కొట్లాటకు సిద్ధంగా ఉన్న కొవ్వాడ రాజు తన వద్ద ఉన్న బరిసె(బల్లెం)తో జంగం పొట్టపై పొడిచాడు. అక్కడే ఉన్న కొవ్వాడ యండయ్య, జమ్మయ్య, తిరుపతిరావు, దాలయ్యలు కర్రలతో దాడి చేయడంతో జంగం అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న జంగం కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొట్టపై పొడిచిన బరెసను చూసి భయాందోళనకు గురయ్యారు. కొద్ది సమయం తర్వాత తేరుకుని కొత్తూరు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భర్త మృతి చెందిన విషయం భార్య బొడమ్మ, కుటుంబ సభ్యులకు తెలియడంతో రోదనలు మిన్నంటాయి. మృతుడికి ఇద్దరు కుమారులు చిన్నారావు, చిరంజీవు ఉన్నారు. మృతుడి భార్య బోడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో టీడీపీ వర్గీయులు.. ఈ ఘటనలో టీడీపీ వర్గీయులు కొవ్వాడ యండయ్య, జమ్మయ్యలకు, వైఎస్సార్సీపీకి చెందిన కామక హిమగిరికి గాయాలయ్యాయి. బరిసితో పొడిచిన కొవ్వాడ రాజుతోపాటు దాడికి పాల్పడిన కొంత మంది పరారిలో ఉన్నారు. సంఘటన స్థలం వద్దకు సీఐ ఎల్.ఎస్.నాయుడు, ఎస్ఐ బాలకృష్ణలు సిబ్బందితో చేరుకున్నారు. గ్రామంలో బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో మూడో దాడి.. నెల రోజుల క్రితం గ్రామానికి టీడీపీకి చెందిన కార్యకర్తలు, వైఎస్సార్సీపీకి చెందిన కుటుంబాలపై (మహిళలు) దాడి చేశారు. మాతలలో సచివాలయం రంగులు వేస్తున్న సంఘటనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అనుచరులు వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. చివరికి వైఎస్సార్సీపీ కార్యకర్తను టీడీపీ వర్గీయులు బరిసితో పొడిచి హత్య చేశారు. ఈ హత్యను మంత్రి కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
కార్యకర్త కన్నెర్రజేస్తే...
రంగుల కల, గ్లామర్, అయ్యప్ప స్వామి, సర్దార్ చిత్రాల్లో బాలనటునిగా చేసిన మనీష్‌బాబు హీరోగా ‘కార్యకర్త’ సినిమా రూపొందనుంది. చిత్తజల్లు ప్రసాదనాయుడు దర్శకత్వంలో జనం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఈ నెల ద్వితీయార్ధంలో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఒక పార్టీ ఎదుగుదలకు ముందుగా శ్రమించే వ్యక్తి కార్యకర్త. ఎలాంటి రాజకీయ చరిత్రకైనా పునాదిరాయి కార్యకర్త. అలాంటి కార్యకర్త కన్నెర్ర చేస్తే రాజకీయ నాయకుల చరిత్ర కాలి బూడిదైపోతుందనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధనుంజయ్, సమర్పణ: జి.ఆంజనేయులు.