టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వర్కింగ్ విమెన్స్ వరకు అందరూ ఎదుర్కొన్నే సమస్య ముఖం నల్లగా మారి, వాడిపోవడం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో బయటకు అడుగు పెట్టనదే పని కాదు. అలాంటప్పడు ఎండకు, కాలుష్యానికి గురై చర్మం నల్లగా మారి కమిలిపోవడం జరుతుంది. ఒక విధమైన డల్‌నెస్‌తో వాడిపోయినట్లు ఉంటుంది. అందుకోసం పార్లర్‌లకు పరుగులు తీయాల్సిన పనిలేదు. మనకు దొరికిన టైంలోనే ఇంట్లో మనం అను నిత్యం వాడే వాటితోనే ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. నలుపు దనానికి చెక్‌పెట్టొచ్చు. ఎలాగో చూద్దామా..!
బంగాళదుంప నాచురల్ బ్లీచ్. బంగాళదుంప రసాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. రసం తీయడం కుదరకపోతే బంగాళదుంపను పలుచగా తరిగి ముఖం మీద పరిచినట్లు అమర్చాలి. అందులోని రసాన్ని చర్మం పీల్చుకున్న తర్వాత ఆ ముక్కలతోనే ముఖమంతటినీ వలయాకారంగా రుద్ది ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే ఎండ తీవ్రత వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల నల్లబడిన చర్మం తెల్లబడుతుంది.
మెడ దగ్గర నలుపు తగ్గాలంటే...
మెడ భాగం జిడ్డుగా, నలుపుగా మారితే బొ΄్పాయిపండు గుజ్జును పట్టించి, పది నిమిషాల మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండుసార్లైనా ఇలా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది.
మోచేతుల నలుపు తగ్గాలంటే నిమ్మ ఉప్పును రాసి,
అరగంట ఉంచి, శుభ్రపరుచుకోవాలి.
ఆలివ్ ఆయిల్‌తో మోచేతుల భాగాన్ని మసాజ్ చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసంతో రుద్దితే నలుపుదనం తగ్గుతుంది.
పెదాలు నలుపు తగ్గాలంటే బీట్‌రూట్ ముక్కతో పెదాలను కొద్దిపాటి ఒత్తిడితో మర్దనా చేయాలి.
శిరోజాల కోసం చూర్ణం..
అరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్‌నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.
(చదవండి: యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!)
Comments
Please login to add a commentAdd a comment