పాకిస్థాన్ సినిమాలకు నో ఎంట్రీ | No Pakistani films this year at International Film Festival of India | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ సినిమాలకు నో ఎంట్రీ

Published Wed, Nov 2 2016 8:51 AM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

పాకిస్థాన్ సినిమాలకు నో ఎంట్రీ - Sakshi

పాకిస్థాన్ సినిమాలకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న భారత్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో పాకిస్థాన్ సినిమాలను ప్రదర్శించడం లేదు. పాకిస్థాన్ నుంచి రెండు ఎంట్రీలు రాగా వాటిని తిరస్కరించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో ఈ వేడుకలు జరగనున్నాయి. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, సహాయ మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా వివరాలను వెల్లడించారు.   

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్కు ప్రపంచ వ్యాప్తంగా 1032 ఎంట్రీలు వచ్చినట్టు తెలిపారు. ఈ వేడుకల్లో 88 థియేటర్లలో 194 సినిమాలను ప్రదర్శించనున్నారు. అయితే పాకిస్థాన్ సినిమాలను ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. కాగా పాక్ నుంచి ఎంట్రీలు పంపిన సినిమాల పేర్లు గుర్తులేదని, వాటిని తిరస్కరించినట్టు చెప్పారు.

ఉడీ ఉగ్రవాదదాడి అనంతరం పాకిస్థాన్ నటులకు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు ఇవ్వరాదని చిత్ర నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. పాక్ నటులకు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వబోమని దర్శక, నిర్మాతలు హామీ ఇచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement