గోవా చలన చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరుకుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రద ర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి. అయినా ముతకగా, పరిణతి లేకుండా చిత్రించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వాళ్లు వేరేరకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంతపెడుతున్నట్టు అని జ్యూరీ అధ్యక్షుడు నదావ్ లపీద్ సరిగ్గానే చెప్పారు. కానీ ఈ ఇజ్రాయిల్ దర్శకుడి నిజాయితీతో కూడిన విమర్శను సహించే నైతిక స్ఫూర్తి మనకు లేకపోయింది.
ఇప్పుడు కాస్త సమయం గడిచిపోయింది, అలాగే భావో ద్వేగాలు కూడా కాస్త చల్లబడి ఉంటాయి. అందుకే ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఇజ్రాయిల్ చిత్ర దర్శకుడు నదావ్ లపీద్ చేసిన విమర్శ చుట్టూ రేగిన ఆగ్రహా వేశాలపై నేను స్పందించాలనుకుంటున్నాను. అది కొంత ఇబ్బంది కలిగించే, చె΄్పాలంటే ఆందోళన కలి గించే మన సమాజ ముఖచిత్రాన్ని బయటపెట్టింది. ఇదే బహుశా మనం పిలుచుకునే జాతీయ స్వభావం.
మొదటగా ఇలా ప్రారంభిద్దాం. ప్రపంచ ప్రఖ్యాత చిత్ర దర్శకుల్లో ఒకరిని, లొకార్నోలో ప్రత్యేక జ్యూరీ ప్రైజ్, బెర్లిన్‌లో గోల్డెన్ బేర్‌ను గెలుచుకున్న విజేతను మన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ జ్యూరీకి అధ్యక్షత వహించడానికి ఆహ్వానించాం. కానీ ఒక భారతీయ సినిమాపై ఆయన చేసిన నిజాయితీతో కూడిన విమర్శను మనం అంగీకరించలేక ΄ోయాం. దానిపై లపీద్ ఇలా అన్నారు: ‘‘చెప్పాలంటే ఒకరకంగా అది నా కర్తవ్యం, నా విధి కూడా. నేను వ్యర్థ సంభాషణ చేయడం కాకుండా నిజాయితీగా ఉండటానికే ఇక్కడికి ఆహ్వానించారు.’’
ఆ దాపరికం లేని నిష్కల్మష ప్రవర్తన మనల్ని నివ్వెరపర్చి ఉండ వచ్చు, పైగా గాయపర్చి ఉండవచ్చు కూడా. కానీ ఆయన చేసిన విమ ర్శను సంతోషంగా ఆహ్వానించే శక్తి, నైతిక స్ఫూర్తి మనకు లేవు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే– లపీద్ చెప్పినదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడాన్నే మనం ఉద్దేశపూర్వకంగా ఎంచు కున్నాం. ఆ సినిమా మార్చి నెలలో విడుదలైనప్పుడు నేను కావాలనే చూడకూడదని భావించాను. కానీ ఈ వివాదం చెలరేగిన తర్వాత ఆ సినిమాను చూడాలనుకున్నాను. ఒక విషాద ఘటన పట్ల ఆలోచనా త్మకంగానూ, సున్నితంగానూ తీయవలసిన దానికి బదులుగా ఆ సినిమా ఒక ముతక చిత్రీకరణగా నాకు కనిపించింది. ఈ చిత్రాన్ని నడిపిన తీరులో సూక్ష్మత, గాఢత లోపించాయి. నటన ఏకపక్షంగా ఉంది.
ఈ సినిమాలోని ఏ ఒక్క పాత్రపట్ల కూడా మనకు సహాను భూతి కలగదు. ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ సరిగ్గా ఆ విషయాన్నే వెల్లడించారు. కానీ ఆయన వ్యాఖ్యలను మనం ఉద్దేశ పూర్వకంగానే తప్పుగా వ్యాఖ్యానించుకున్నాం. వాటిని కశ్మీర్ పండిట్లకు జరిగిన ఘటనల పట్ల తిరస్కరణగానూ, చని΄ోయిన వారి స్మృతిని అవమానించడంగానూ అర్థం చేసుకున్నాం.
ఒక్క క్షణకాలం పాటు మనం ఆలోచించడం కోసం ఆగినట్లయితే, ఆయన వ్యాఖ్యలను మనం ఎంత తప్పుగా భావిం చామో మనకు తెలిసేది. కానీ మనం అలా చేయలేక ΄ోయాం. ఒక అధమ స్థాయి సినిమాను సమర్థించుకునే మార్గం అదన్నమాట! ఒకసారి లపీద్ విమర్శ మన ఆత్మాభిమానాన్ని గాయపర్చాక, ఆయన విమర్శను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడానికి పూనుకున్నాం. పైగా అది మన జాతీయవాదంపై దాడిగానూ, ఇంకా చె΄్పాలంటే ఏకంగా మనపైనే చేసిన దాడిగానూ చూడటానికి పూనుకున్నాం. కానీ లపీద్ దీనిపై స్పష్టంగా ఆయన అభిప్రాయం వివరించారు: ‘‘ఒక సినిమాను విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించడం కాదు లేదా కశ్మీర్‌లో జరిగినదాన్ని విమర్శించడం అంతకంటే కాదు’’.
నన్ను మరికాస్త ముందుకెళ్లి చెప్పనివ్వండి. గోవా చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరు కుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ చిత్రో త్సవంలో ప్రదర్శించడానికి ‘కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? విస్మరణకు గురైన ఒక విషాదం వైపు ప్రపంచానికి కిటికీ తెరవడానికి– ముతకగానూ, పరిణతి లేకుండానూ చిత్రించినది; ఇది మన చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యుత్తమ సినిమా కాదు అనే వాస్తవాన్ని కూడా విస్మరించారా?
నదావ్ లపీద్ దాన్ని ఇలా చూశారు: ‘‘ద కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చిత్రోత్సవాల్లో ΄ోటీ విభా గంలో భాగం కాకూడదు. డజన్లకొద్దీ చిత్రోత్సవాల్లో నేను జ్యూరీలో భాగమయ్యాను. బెర్లిన్, కాన్, లొకార్నో, వెనిస్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా నేను ΄ాలు పంచుకున్నాను. ఏ చిత్రోత్సవంలోనూ కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను నేను చూడలేదు. మీరు ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వేరే రకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంత పెడు తున్నట్టు.’’ ఇదేమీ ఒప్పుకోలేని వాదన కాదు కదా!
చివరగా, మీడియా గురించి నన్ను చెప్పనివ్వండి. అది మనకోసం మాట్లాడుతున్నట్లు ప్రకటించు కుంటుంది. తాను ప్రజావాణిని అని మీడియా నమ్ముతుంటుంది. కానీ ఈ సినిమాను సమర్థించడానికి అది చేస్తున్న ప్రయత్నాలు మాత్రం తెలివిలేనివి, పైగా అసమర్థమైనవి కూడా! ఈ సినిమా గురించి తనకు కలిగిన అభిప్రాయాలనే జ్యూరీ సభ్యులు కూడా పంచుకున్నారని లపీద్ చెప్పినప్పుడు దాన్ని నిరూపించాలని టెలివిజన్ యాంకర్లు సవాలు చేశారు.
ఓ రకంగా ఇది ఆయన అబద్ధ మాడుతున్నాడని సూచించే వెర్రి ప్రయత్నం మాత్రమే అవుతుంది. పైగా, లపీద్‌కు తమ మద్దతును బహిరంగంగా నిర్ధారించేలా అది ఇతర జ్యూరీ సభ్యులను రెచ్చగొట్టింది. మరోవైపున, ఒక వార్తాపత్రిక ఏకంగా అబద్ధమాడింది. లపీద్ తన మనస్సు మార్చుకున్నారనీ, ఆ సినిమా మేధోవంతంగా ఉందనీ చె΄్పారని ఆ పత్రిక నివేదించింది. నిజానికి ఆయన తన మనస్సు మార్చుకోలేదు. ఆయన అలా చేస్తాడ నుకోవడం కూడా బుద్ధిహీనతే అనాలి.
సాధారణమైన ఆలోచనతో దీన్ని ముగిస్తాను. ఫిల్మోత్సవ్ అవార్డు కార్యక్రమంలో ఒక నిర్దిష్ట సినిమాను విమర్శించే హక్కు లపీద్‌కు›ఉందా లేదా అనేది న్యాయమైన ప్రశ్న. ఇది చాలా చిన్న విషయం కూడా. దీనికంటే మన ప్రవర్తనే మరింత పెద్ద సమస్యగా ఉంటోంది. చిత్రోత్సవం కోసం మనం ఎంపిక చేసుకున్న సినిమా, దానికి లభించిన విమర్శకు మనం స్పందించిన తీరు మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. కాబట్టి ఇది ఒక విషాదకరమైన, బాధాకరమైన గాథ!
కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment