కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్‌లోని కరాచీలో జరుగుతున్న ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, నటులు నందితా దాస్, వినయ్ పాఠక్ తదితరులు హాజరయ్యారు. ‘జానర్ బస్టర్స్’ అనే అంశంపై వీరు మాట్లాడారు.
ఓ సినిమాకు గొప్ప కథ ఉంటే అది వాణిజ్య పరమైన చిత్రమైనా, కళాత్మకమైనదైనా కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజమౌళి అన్నారు. భారత్‌లో ప్రస్తుతం కళాత్మక, స్వతంత్ర సినిమాలకు స్థానం లేకుండా పోతోందనీ, వాణిజ్య చిత్రాలకు మాత్రమే రోజులు ఉన్నాయా అన్నట్లు పరిస్థితి తయారైందని నటి నందితా దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అన్ని రకాల సినిమాలూ రావాలి. ప్రతి సినిమాలోనూ పాటలు, పోరాట సన్నివేశాలు ఉండి కథ సుఖాంతమే అవ్వాల్సిన అవసరం ఉండకూడదు’ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment