
ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ‘క్వాంటికో’ టీవీ షోలో హాట్ హాట్‌గా కనిపించి, హాలీవుడ్‌లో సెటిలైపోయిన ప్రియాంక, పూర్తిగా అక్కడికే మకాం మార్చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ‘బేవాచ్’ అనే సినిమాలో నటించారామె! ఆ సినిమా అంతగా ఆడకపోయినా, ప్రియాంకకు మాత్రం బాగానే పేరొచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇక ‘ఎ కిడ్ లైక్ జేక్’ పేరుతో ఆమె నటించిన ఓ సినిమా జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘బేవాచ్’లాగా ఇది పాపులర్ జానర్ సినిమా కాకపోయినా, ఈ సినిమాకూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది.
ఆ క్రేజ్‌కు తోడు జనవరిలో యూఎస్‌లో జరగనున్న సండేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఎ కిడ్ లైక్ జేక్’ ప్రదర్శితం కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. 29 దేశాల నుంచి ఎంపిక చేసిన సినిమాలతో సండేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జనవరి 18 నుంచి 28 వరకు పదిరోజుల పాటు జరగనుంది. అక్కడ ప్రీమియర్ ముగిశాకే ‘ఎ కిడ్ లైక్ జేక్’ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. రెండో సినిమాకే ప్రియాంక హాలీవుడ్‌లో తన బ్రాండ్‌ను సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే మరో రెండు, మూడు సినిమాలు చేసి ప్రియాంక అక్కడికి షిఫ్ట్ అయిపోతారనే టాకే ఎక్కువ వినిపిస్తోంది!