
శ్రుతీహాసన్ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మార్క్ రౌలీ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇదిలా ఉంటే... ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
తాజాగా ముంబైలో గురువారం ప్రారంభమైన 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ విభాగాల్లో) ఇండియా తరఫున ‘ది ఐ’ చిత్రం ప్రీమియర్ అయింది. మార్చి 2 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి.
మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం మహిళల నేతృత్వంలోనిప్రొడక్షన్ హౌస్‌లో ‘ది ఐ’ని రూపోందించడం విశేషం. ఇండస్ట్రీలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నా అభిరుచికి అనుగుణంగా ఈప్రాజెక్ట్ ఉంటుంది’’ అన్నారు. కాగా శ్రుతీహాసన్ గతంలో ‘ట్రెడ్ స్టోన్’ అనే హాలీవుడ్ టీవీ సిరీస్‌లో నటించగా, ‘ది ఐ’ ఫస్ట్ హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment