అవార్డు స్వీకరిస్తున్న బుర్రా వెంకటేశం, సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. యూరప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన ‘విజట్ తెలంగాణ’చిత్రానికి ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు వరించింది. శనివారం అక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫిల్మ్ మేకర్ సత్యనారాయణ అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకశాఖకు అవార్డు దక్కటం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా త్వరలో నిర్వాహకుల బృందం హైదరాబాద్‌లో పర్యటించనుందని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment