‘ఎఫ్ 2’లోవరుణ్ తేజ్, మెహరీన్, వెంకటేశ్, తమన్నా
ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులకు కితకితలు పెట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టిన చిత్రం ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్’ రాజు నిర్మాత. తమన్నా, మెహరీన్ కథానాయికలు. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన గౌరవం పొందింది. ఈ ఏడాది గోవాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘ఎఫ్ 2’ చిత్రం ప్రదర్శితం కానుంది. అక్కడ ప్రదర్శించబోయే 250 సినిమాల్లో ‘ఎఫ్ 2’ ఒక్కటే తెలుగు సినిమా కావడం విశేషం. ‘‘ఈ గౌరవం పొందడం చాలా గర్వంగా ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది ఐఎఫ్‌ఎఫ్‌ఐకు గోల్డెన్ జూబ్లీ ఇయర్. నవంబర్ 20 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment