ఇండస్ట్రీలోనే అలాంటి తొలి చిత్రం.. అవార్డ్ కైవసం! | Tollywood Movie Gets International Film Festival Of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Hello Baby: సోలో క్యారెక్టర్‌.. ఇండస్ట్రీలో తొలి హ్యాకింగ్ చిత్రం!

Published Wed, Feb 7 2024 9:05 PM | Last Updated on Thu, Feb 8 2024 9:36 AM

Tollywood Movie Gets International Film Festival Of Andhrapradesh - Sakshi

కావ్య కీర్తి కీలక పాత్రలో నటించిన చిత్రం హలో బేబీ. ఈ మూవీ తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్‌ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం వహించారు.  ఎస్‌కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించారు. తాజాగా ఈ అవార్డును తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఆదినారాయణకు అందించారు.

కాగా.. ఈ సినిమా ఇండస్ట్రీలోనే మొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలిచింది. కేవలం సోలో క్యారెక్టర్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో 200కి పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్ హిందీలో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్ అందుకుంది. ఇండస్ట్రీలో తొలి హ్యాకింగ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుందని సెన్సార్ అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు  సుకుమార్ పమ్మి సంగీతమందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement