
ఎంతో బ్యూటిఫుల్.. ఏ కాలేజ్.. అని కొందరు అమ్మాయిలు అనడం.. ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో ఓ పాప.. మమ్మీ.. అని పిలవడం..
హా.. మమ్మీ.. అని వీళ్లు నోరెళ్లబెట్టడం.. ఈ యాడ్ మనందరికీ బాగా తెలిసిందే.. అక్కడ నోరెళ్లబెట్టింది
ఇద్దరు ముగ్గురు అమ్మాయిలే.. ఇక్కడ మనమందరం నోరెళ్లబెట్టాల్సిన విషయమొకటి ఉంది.
ఓసారి ఫొటో చూడండి.. చూశారుగా.. ఇప్పుడు విషయం వినండి..
వీళ్లలో కూడా ఓ మమ్మీ ఉంది.. చిన్నపిల్లకు మమ్మీ కాదు.. ఈ ఫొటోలోని మరో అమ్మాయికి మమ్మీ!!
ఇంతకీ వీరిలో ఎవరు మమ్మీ??
ఇందులో నల్లరంగు దుస్తులు వేసుకున్న ఆమె పేరు యాన్‌నీ.. వయసు 47.. పక్కనున్న యువాన్‌క్వింగ్(20)కు ఈమెనే మమ్మీ! యాన్‌నీ చైనాకు చెందిన సినిమా నటి. వయసు పెరిగేకొద్దీ మరింత అందంగా తయారవుతోందంటూ యాన్‌నీని అందరూ ప్రశంసించేవారు.
అయితే.. ఇటీవల 8వ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె తన కుమార్తెతో వచ్చింది. అప్పుడా ఇద్దరినీ చూసినవారు మరింత ఆశ్చర్యపోయారు. అచ్చం అక్కచెల్లెల్లా ఉన్నారని.. ఇద్దరిలో ఎవరు పెద్ద అంటే చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు.