లేక్‌ వ్యూ ఫెస్టివల్‌కు జార్జిరెడ్డి | George Reddy Selected For Lake View Int Film Festival | Sakshi
Sakshi News home page

లేక్‌ వ్యూ ఫెస్టివల్‌కు జార్జిరెడ్డి

Published Sun, Dec 22 2019 6:43 AM | Last Updated on Sun, Dec 22 2019 6:43 AM

George Reddy Selected For Lake View Int Film Festival - Sakshi

సందీప్‌ మాధవ్‌

స్టూడెంట్‌ లీడర్‌ జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జార్జిరెడ్డి’. సందీప్‌ మాధవ్‌ టైటిల్‌ రోల్లో, జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి, సంజయ్‌రెడ్డి, దామోదర్‌ రెడ్డి నిర్మించారు. నవంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ‘జార్జిరెడ్డి’ చిత్రం ఫోర్త్‌ లేక్‌ వ్యూ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ చిత్రాన్ని ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో ఈ చిత్రం ప్రత్యేక పదర్శనలు జరుగనున్నాయి. ‘‘చిన్న సినిమాగా విడుదలైన మా ‘జార్జిరెడ్డి’ ఇండస్ట్రీని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లెవల్‌కి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ వేడుకకు చిత్రయూనిట్‌ హాజరు కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement