Madhurapudi Gramam Ane Nenu
-
రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్‌కి మధురపూడి..
‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2023కి ఎంపిక అయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది. ఈ మూవీ 10వ ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి ఎంపిక అయింది. 2024 జనవరిలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘‘మా మూవీ భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘ఈ సినిమాపై మొదటి నుండి మా టీమ్ చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’’ అన్నారు మల్లి. -
'మధురపూడి గ్రామం అనే నేను' సినిమా రివ్యూ
టైటిల్: మధురపూడి గ్రామం అనే నేను రచన-దర్శకత్వం: మల్లి, నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్ విడుదల తేదీ: అక్టోబరు 13 శివ కంఠమనేని హీరోగా మల్లి దర్శకత్వంలో తీసిన సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. మణిశర్మ సంగీతమందించారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటి? మధురపూడి అనే ఊరు తన ఆత్మకథ చెబుతుంది. ఈ ఊరిలో సూరి (శివ కంఠమనేని) అనే మొండోడు. తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వరకైనా నిలబడతాడు. అలాంటి సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథలిన్ గౌడ) ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చాక సూరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఊర్లోని రాజకీయాలకు సూరికి సంబంధమేంటి? అసలు ఈ కథకు 700 కోట్ల రూపాయల డిజిటల్ స్కామ్‌కు సంబంధం ఏంటి అనేది స్టోరీ. ఎలా ఉందంటే? ఓ కథలో రివేంజ్, పొలిటిక్స్, లవ్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఉండటం విశేషం. 'మధురపూడి గ్రామం అనే నేను' ఇలాంటి అంశాలతో తీసిన చిత్రం. పాత్రలు ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యేసరికి కాస్త టైమ్ పట్టింది. దీంతో ఫస్టాప్ అంతా నిదానంగా సాగింది. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్దం పర్వాలేదనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ట్విస్టులు ఆకట్టకున్నాయి. క్లైమాక్స్‌లో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి పనితీరు కనిపించింది. ఎవరెలా చేశారు? సూరి పాత్రలో శివ కంఠమనేని చక్కగా నటించాడు. అన్నిరకాల ఎమోషన్స్‌ని బాగా చేశాడు. హీరోయిన్ క్యాథలిన్ గౌడ ఓకే అనిపించింది. కథలో కీలకమైన హీరో స్నేహితుడిగా బాబ్జీ పాత్రను మలిచిన తీరు బాగుంది. భరణి శంకర్ ఫరిది మేర నటించాడు. వనితా రెడ్డి, జబర్దస్త్ నూకరాజు, మహేంద్రన్ తదితరులు పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే మణిశర్మ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సురేశ్ భార్గవ్ విజువల్స్ చక్కగా ఉన్నాయి నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లు ఉన్నాయి. -
రెగ్యులర్ కథలు చేయను : శివ కంఠమనేని
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘మధురపూడి గ్రామం అనే నేను’. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ– ‘‘ఒంగోలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామా ఈ చిత్రం. మొరటుగా ఉండే సూరి పాత్రలో కనిపిస్తాను. తన మిత్రుడు బాబ్జీ ఎమ్మెల్యే కావడం కోసం సూరి ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతని ప్రేమకథ ఏ విధంగా ప్రభావితమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కమర్షియల్ పంథాలోనే ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రేమ అనేది శరీరానికి కాదు.. మనసులకు సంబంధించినదనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది. నేను రెగ్యులర్ కథలు చేయను. నేను చేసిన ‘అక్కడొకడుంటాడు’లో నా పోస్టర్స్ చూసి ‘మధురపూడి..’ సినిమా కథకు నన్ను ఎంపిక చేసుకున్నారు మల్లికార్జున్గారు. దాదాపు 150కిపైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రాలు ‘మణిశంకర్, రాఘవరెడ్డి’ త్వరలో రిలీజ్ కానున్నాయి. మంచు లక్ష్మిగారి ‘ఆదిపర్వం’ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను’’ అన్నారు.