ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: ప్రజలకు సేవలందిస్తూ మంచిపేరుతో పాటు వార్తల్లో నిలుస్తుంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే మరికొందరు మాత్రం లంచాలు, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఉద్యోగి బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలు, బాలికలకు ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతి నగరంలో మొబైల్‌లను ఇచ్చేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. సునీల్ కుమార్ జన్‌గిడ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. తోడాభిమ్ ప్రాంతానికి చెందిన బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అతని తల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళింది, తండ్రి జైపూర్ వెళ్ళాడు.
ఈ విషయం సునీల్‌కు తెలియడంతో బాలిక ఇంటికి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ ఇస్తోందని చెప్పి తనతో పాటు రావాలని చెప్పి.. ఆమెను తన వాహనంపై ఎక్కించుకుని దగ్గరల్లోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఈద్గా మార్గంలో వదిలేశాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారాన్ని వ్యతిరేకించినందుకు క్యాషియర్ తనను కూడా కత్తితో పొడిచి గాయపరిచాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది.
చదవండి వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి!
Comments
Please login to add a commentAdd a comment