govt employee
-
తానే దిద్దుకున్న బతుకు చిత్రం
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.బతుకు బడి రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్లు చేసి జీతం పెంచుకుంది.కష్టాల పాఠాలురషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.విజేత లక్ష్యం రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్. ఇకిగాయ్ నేర్పించింది ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మహిళా ఉద్యోగినిపై నోరుపారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి
-
ప్రభుత్వాఫీస్‌లో అధికారి జల్సాలు..
లక్నో:ప్రజలకు సేవచేయాల్సిన స్థానంలో ఉండి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. ప్రభుత్వ ఆఫీసులు తమ సొంత నివాసాలుగా భావిస్తుంటారు. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో జల్సాలు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తించాల్సిన సమయంలో కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో కపూర్ సింగ్ అనే అధికారి స్వైజ్పూర్ రిజిస్టర్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీస్‌కు వచ్చి టేబుల్ మీదే దర్జాగా మద్యం సేవించారు. ఓ చేతిలో ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో మద్యం సేవిస్తూ స్థానిక మీడియాకు చిక్కారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. #हरदोई- सरकारी दफ्तर में एक कर्मचारी का शराब पीते वीडियो वायरल,रजिस्ट्री ऑफिस सवायजपुर में तैनात चपरासी कपूर सिंह का दारू पीने का वीडियो हुआ वायरल,ऑफिस में जाम छलकते नजर आ रहा है कर्मचारी,हरदोई के सवायजपुर रजिस्ट्री ऑफिस का बताया जा रहा है @hardoipolice#ViralVideos @dmhardoi pic.twitter.com/5gVKmrEI6u — anuj Pal (@anujPal50037043) August 27, 2023 సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు చివాట్లు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల పంజాబ్‌లోని హోషియాపూర్‌లో సెంట్రల్ జైలు పోలీసులు అంబులెన్స్‌లోనే మద్యం సేవించిన ఘటన మరవకముందే యూపీలో ఈ ఘటన జరిగింది. ఇదీ చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి.. -
ఫ్రీగా ఫోన్ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి
జైపూర్: ప్రజలకు సేవలందిస్తూ మంచిపేరుతో పాటు వార్తల్లో నిలుస్తుంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే మరికొందరు మాత్రం లంచాలు, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఉద్యోగి బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలు, బాలికలకు ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతి నగరంలో మొబైల్‌లను ఇచ్చేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. సునీల్ కుమార్ జన్గిడ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. తోడాభిమ్ ప్రాంతానికి చెందిన బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అతని తల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళింది, తండ్రి జైపూర్ వెళ్ళాడు. ఈ విషయం సునీల్‌కు తెలియడంతో బాలిక ఇంటికి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ ఇస్తోందని చెప్పి తనతో పాటు రావాలని చెప్పి.. ఆమెను తన వాహనంపై ఎక్కించుకుని దగ్గరల్లోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఈద్గా మార్గంలో వదిలేశాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారాన్ని వ్యతిరేకించినందుకు క్యాషియర్ తనను కూడా కత్తితో పొడిచి గాయపరిచాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చదవండి వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి! -
బంఫర్ ఆఫర్: ‘ఉద్యోగులకు’ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అవేరా ముందుకొచ్చింది. ఈ మేరకు నెడ్‌క్యాప్‌తో అవేరా ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నెడ్‌క్యాప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ రమణా రెడ్డి, అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణలు ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ‘గ్రీన్ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యేక ధరలకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం అవేరా రెటోరోసా–2 స్కూటర్‌పై రూ.10,000, రెటోరోసా లైట్ వాహనంపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 7,000 వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Fact Check: కుంగుతున్నది రామోజీ బుద్ధే -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల HRA పెంచుతూ ఉత్తర్వులు
-
ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ నేత పంకజ్ దీక్షిత్ ఓ ప్రభుత్వ ఉద్యోగితో గొడవపడ్డాడు. బారాబంకీలో నిర్వహించిన కృషి మేళాలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అలోక్ సింగ్ బయట నుంచి క్యాబేజీ తెచ్చినందుకు ఆగ్రహించిన పంకజ్ సింగ్.. అతనితో ముష్టియుద్ధానికి దిగాడు. ఉద్యోగిపై దాడి చేసి కిందపడేశాడు. అనంతరం పలుమార్లు కొట్టాడు. చివరకు అక్కడున్నవారు కలుగజేసుకుని ఇద్దరినీ ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పంకజ్ దీక్షిత్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించాడు. వీళ్లు తీరుమార్చుకోకపోతే మళ్లీ ఇలాగే చేస్తానని హెచ్చరించాడు. #बाराबंकी बीजेपी नेता पंकज दीक्षित ने सरकारी कर्मचारी आलोक सिंह को जमकर पीटा, कृषि मेले में हुई इस शर्मनाक घटना का वीडियो सोशल मीडिया पर वायरल pic.twitter.com/uen9SCO5kT — ठाkur Ankit Singh (@ankit_singh08) February 28, 2023 చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. -
త్వరలో కేంద్ర బడ్జెట్.. ఉద్యోగుల ఆశలన్నీ వాటిపైనే!
మరికొద్ది రోజుల్లో కేంద్రం బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టబోతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తులు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది పలు రాష్ట్రాలకు ఎన్నికలతో పాటు 2024లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్ ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు నిపుణులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ప్రజారంజకంగా బడ్జెట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వేతన జీవులు బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పన్ను మినహాయింపుల మాటేమిటి గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపు పన్నుపై కేంద్రం ఎటువంటి సంస్కరణలను ప్రకటించలేదు. ప్రస్తుత బడ్జెట్లో పన్ను విధానంలో మార్పు కీలకమైన డిమాండ్‌గా వినిపిస్తోంది. ఐచ్ఛిక ఆదాయపు పన్ను ప్రకటించబడినప్పటికీ, ఉపశమనం అందించే విషయంలో ఇది చాలా వరకు ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు చెబుతున్నారు. పాత ఆదాయపు పన్ను విధానంలో వర్తించే స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 పెంచాలని అనేక వినతులు వచ్చాయి. అలాగే కొన్ని మినహాయింపులను కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మరో వైపు అధ్వానంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో పాటు ఆర్థిక మాంద్యం ప్రభావాలు కలిసి రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కఠినమైన సవాలును ఎదుర్కొంటుందని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
రిటైర్మెంట్లో రికార్డు.. ఒకే రోజు 25 వేల మంది ఇంటిబాట!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మంగళవారం 25 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు అన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020లో దీన్ని 60 ఏళ్లకు పెంచారు. కొత్తగా పోస్టుల భర్తీకి అవకాశం లేని దృష్ట్యా, 58 ఏళ్లు నిండిన వాళ్లకు రెండేళ్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ గత అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధుల్లో కొనసాగుతూ వచ్చిన నగరాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్య, వైద్య తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు రెండేళ్ల పాటుగా విధుల్లో కొనసాగారు. వీరందరి పదవీ కాలం మే 31(మంగళవారం)తో ముగిసింది. దీంతో ఈ ఒకే రోజున రికార్డు స్థాయిలో 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఇక, వీరికి పదవీ విరమణ నిధి కేటాయింపు కోసం రూ. ఐదు వేల కోట్ల మేరకు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో లక్షా 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా పదవీ విరమణతో ఆ సంఖ్య లక్షా 75 వేలకు చేరినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. టీఎన్పీఎస్సీ ద్వారా భర్తీ కండెక్టర్లు, డ్రైవర్లు తదితర పోస్టులను ఇది వరకు రవాణాశాఖ భర్తీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో టీఎన్పీఎస్సీ ద్వారా భర్తీకి తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు టీఎన్పీఎస్సీ మంగళవారం ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. అయితే, కండెక్టర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది నియమకానికి టీఎన్పీఎస్సీకి అవకాశాలు ఉన్నా, డ్రైవర్ల ఎంపిక మాత్రం కొంత ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. డ్రైవర్ల ఎంపిక రాత పరీక్ష, ఇతర అర్హతల మీద కన్నా, అనుభవం ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ దృష్ట్యా, డ్రైవర్ల ఎంపికపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని టీఎన్పీఎస్సీ కోరినట్లు సమాచారం. -
ద్యావుడా!.. పదకొండేళ్లకు కదిలిన అవినీతి చిట్టా
సాక్షి, కరీంనగర్: అది 2011 సంవత్సరం. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్డీఏ)లో వెలుగుచూసిన గడ్డపారల స్కాం ఉమ్మడి జిల్లాను కుదిపేసింది. డీఆర్డీఏ అధికారుల ఆగడాలు చూసి, విని ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖ 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత కొంతకాలం క్రితం తుది నివేదికను సమర్పించింది. నిందితులపై చేసిన విచారణ ఆధారంగా పలు సూచనలు, సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించిన డీఆర్డీఏ ఏసీబీ డైరెక్టర్ జనరల్ చేసిన సిఫారసులను అమలు చేయాలని ఆయా విభాగాలకు అధికారికంగా ఇటీవల లేఖలు రాసింది. ఈ కుంభకోణంలో ఏ–1పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఏ–2, ఏ–3లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని స్పష్టంచేశారు. ఐకేపీ ఫిర్యాదుతో వెలుగులోకి.. ►ఉమ్మడి రాష్ట్రంలో 2010–11 ఆర్థిక సంవత్సరంలో డీఆర్డీఏ చేపట్టిన అనేకపనులపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా గడ్డపారల కొనుగోళ్లలో గోల్మాల్, అభయహస్తం పింఛన్ పథకంలో నిధుల పక్కదారి.. తదితర వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టాయని, సాక్షాత్తూ డీఆర్డీఏ అధికారులు కొందరితో కుమ్మక్కై ప్రజాధనాన్ని జేబులో వేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్‌లోని ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) సిబ్బంది ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారు. 2011 మే 9వ తేదీన ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్ఐఆర్లో ప్రధాన ఆరోపణలు ఇవే! ►గడ్డపారల కొనుగోళ్లలో సరఫరా చేసే కంపెనీతో రూ.3.8 కోట్లకు రహస్య ఒప్పందం చేసుకున్నారు. అప్పటి ఉమ్మడి జిల్లాలోని 57 మండలాల్లోని మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేయల్సి ఉండటం గమనార్హం. ఇలా తప్పుడుమార్గంలో వెళ్లినందుకు రూ.38 లక్షల కమిషన్ దక్కిందని ఆరోపణలు. ► అభయహస్తం పింఛన్ పథకంలో నిధుల రూ.18 లక్షలు పక్కదారి. ట్రైనీలకు భోజనం పేరిట రూ.35 లక్షలు ఖర్చు చూపారు. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఇప్పటి అంబేద్కర్ స్టేడియంలో స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళలు సమావేశం పేరిట రూ.40లక్షలు తప్పుడు బిల్లుల పేరిట క్లయిం చేసుకున్నారు. ఇందులో డెకరేషన్‌కు రూ.20 లక్షలు చూపడం విశేషం. ► యాభైవేల స్వయం సహాయ గ్రూపులకు పుస్తకాల ప్రింటింగ్ పేరిట రూ.15 లక్షల బిల్స్ పెట్టారు. విలేజ్ మార్కెటింగ్ కమిటీ మెంబర్స్‌కు శిక్షణ పేరిట రూ.15 లక్షలు దుర్వినియోగం. రబీ పంటలో గ్రామ సమాఖ్యల సాయంతో రైస్ మిల్లర్ల నుంచి దాదాపు రూ.10 లక్షలు వసూలు చేశారు. సదరం క్యాంపు కోసం ఎలాంటి అనుమతి లేకుండా దాదాపు 40 కంప్యూటర్ల కొనుగోళ్లు. ► ఈ మొత్తం స్కాంలో రూ.1.66 కోట్ల మేరకు నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఇందులో స్వయం సహాయక గ్రూపులకు పుస్తకాల ముద్రణ కోసం రూ.15 లక్షల విషయంలో, రైస్‌మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు, అనుమతి లేకుండా కంప్యూటర్ల కొనుగోలు ఆరోపణలు ఏసీబీ దర్యాప్తులో రుజువు కాలేదు. మిగిలిన ఆరోపణలకు సంబంధించి శాఖాపరమైన చర్యలు సూచిస్తూ పంచాయతీరాజ్‌శాఖకు అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ సిఫారసులు పంపారు. ముగ్గురు నిందితులపై చర్యలకు లేఖలు.. ఈ కేసులో ఏ–1గా అప్పటి డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పడాల రవీందర్ (ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్), ఏ–2గా అర్ష వేణుగోపాల క్రిష్ణ (ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసర్, డీఆర్డీఏ కరీంనగర్,), ఏ–3 ఐలినేని కృష్ణారావు (డీఆర్డీఏ, ఏపీఎం/కాంట్రాక్ట్ ఉద్యోగి) ఈ ముగ్గురిలో పడాల రవీందర్‌పై వెంటనే శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని, మిగిలిన వేణుగోపాల్ క్రిష్ణ, ఐలినేని రవీందర్లను విధుల నుంచి తొలగించాలని తుది విచారణ అనంతరం ఏసీబీ డైరెక్టర్ జనరల్ సిఫారసు చేశారు. ఈ సిఫారసుల ఆధారంగా పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల ఆయా విభాగాలకు లేఖలు రాశారు. చదవండి: ట్రెండు మారుతోంది...ఆడబిడ్డే కావాలి..! ‘కారా’ దరఖాస్తు విధానం ఇలా! -
ఆ సార్‌కి.. డ్యూటీ కంటే మద్యం ముద్దు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రభుత్వ పనిని దేవుని పనిగా భావిస్తారు. అయితే ఆ పని వదిలేసి ఫుల్లుగా తాగి రోడ్డు మీద పడిపోయాడో ఉద్యోగి. ఈ సంఘటన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. సంజు బెన్నె గొరవనకొళ్ల గ్రామ విలేజ్ అకౌంటెంట్‌గా ఉన్నాడు. అయితే విధులకు సరిగా హాజరవకుండా మద్యం తాగి వస్తుండడంతో అతన్ని అక్కడి నుండి తాలూకాఫీసుకు మార్చారు. ఇక్కడా అదే తంతు. తాగిన మత్తులో ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం కూడా మద్యం తాగి వాహనాలు పార్కింగ్ చేసే చోట పడిపోయాడు. ఇటువంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు తహసీల్దార్‌ను డిమాండు చేశారు. చదవండి: పిల్లల్ని కంటారా... లేదంటే ఐదు కోట్లిస్తారా? -
యధావిధిగా విధుల్లోకి ఉద్యోగులు
-
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు తీపికబురు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర మంత్రివర్గం తీపికబురు చెప్పినట్లు సమాచారం. తమకందాల్సిన కరువుభత్యానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికి అందాల్సిన కరువు భత్యాలను మొత్తం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరే నిర్ణయం తీసుకున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ నేడో రేపో విడుదల చేయనున్నట్లు ఆ వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే కరువు భత్యానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
AP: జీతాలు, పింఛన్లకు మనకే ఖర్చెక్కువ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కన్నా రాబడి బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం.. తమ ఉద్యోగుల జీతభత్యాలపై ఇక్కడికన్నా తక్కువే వెచ్చిస్తున్నాయి. భౌగోళికంగా ఏపీ కన్నా పెద్ద రాష్ట్రాల్లోనూ జీతభత్యాల వ్యయం ఇక్కడికన్నా తక్కువే ఉంది. సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నెలవారీ గణాంకాలు దీన్ని వెల్లడించాయి. 2021–2022 తొలి ఏడు నెలల గణాంకాలను (ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు) విడుదల చేస్తూ... ఈ ఏడు నెలల్లో జీతాలు, పెన్షన్ల వ్యయం దాదాపు రూ.36వేల కోట్లకు పైగా అయిందని, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కానీ... గుజరాత్, తెలంగాణ వంటి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కానీ ఈ స్థాయి వ్యయాలు కాలేదంటూ గణాంకాలను బయటపెట్టింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఒక పక్క కరోనాతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గడిచిన రెండేళ్లలో దాదాపు 22వేల కోట్ల ఆదాయం తగ్గిపోగా... కోవిడ్ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణపై రూ.8వేల కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. ఇలా రూ.30వేల కోట్లను కోవిడ్ మహమ్మారి మింగేసినప్పటికీ... ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను చెల్లిస్తూ వస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2021–22 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వేతనాలు, పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.36,006.11 కోట్లు వెచ్చించింది. ఇందులో వేతనాల రూపంలో 24,681.47 కోట్లు ఖర్చు చేయగా పెన్షన్ల కింద రూ.11,324.64 కోట్లు వెచ్చించింది. ఇటీవల 11వ వేతన సవరణ కమిషన్ నివేదికపై సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ కూడా రాష్ట్రంలో వేతనాల వ్యయం చాలా ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ కమిటీ రాష్ట్ర సొంత ఆదాయం కన్నా వేతనాలు వ్యయం ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణను రాష్ట్రం భరించలేదని కూడా కీలకమైన వ్యాఖ్య చేసింది. అందుకు తగినట్లుగానే ఈ ఆర్ధిక ఏడాది వేతనాల వ్యయంపై కాగ్ గణాంకాలు కూడా ఉండటం గమనార్హం. ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం వేతనాల రూపంలో రూ.3500 కోట్లకు పైగా చెల్లిస్తోంది. పెన్షన్ల రూపంలో మరో 1500 కోట్లకు పైగా ప్రతీ నెల చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రతీ ఏటా వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతూనే ఉంది. -
కులం పేరుతో ప్రభుత్వ ఉద్యోగికి అవమానం
-
ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్య..
తలమడుగు(బోథ్): ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని కుచులపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ పురుషోత్తంచారి వివరాల ప్రకారం... రాగి ఉత్తమ్(53) జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లా డు. భోజనం అనంతరం రాత్రి పదున్న ర గంటలకు బయటకు వచ్చాడు. అదే సమయంలో అదును కోసం వేచిచూస్తున్న సుధాకర్ పాత కక్షల నేపథ్యంలో బండరాయితో ఉత్తమ్ తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి సుధాకర్ పారిపోయాడు. ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ పురుషోత్తంచారి, ఎస్సైలు దివ్య భారతి, ప్రవళిక వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఉత్తమ్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిందితుడి పట్టివేత... హత్య చేసి పారిపోయిన నిందితుడు సుధాకర్‌ను పట్టుకున్నట్లు ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీఐ వెల్లడించారు. ఉత్తమ్‌ని అదే గ్రామానికి చెందిన మందాడి సుధాకర్ పాత కక్షల నేపథ్యంలో హత్య చేయడానికి కుట్ర పన్నాడని, శనివారం రాత్రి ఒంటరిగా ఇంటి బయట కనిపించిన ఉత్తమ్‌ను బండరాయితో తలపై కొట్టి హత్య చేసి పారిపోయాడని తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు సుధాకర్‌ను అతడి పంట పొలంలో పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. -
అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే
ఇండోర్: ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై బీజేపీ సీనియర్ నాయకుడు కైలాశ్వర్గియా కుమారుడు, ఎమ్మెల్యే విజయ్‌వర్గియా క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను వెనక్కు వెళ్లిపోవాలంటూ స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగస్తుడైన విజయ్ బ్యాట్‌తో ప్రభుత్వోద్యోగిపై దాడి చేశాడు. బీజేపీ తమకు మొదట అభ్యర్థించాలని, తర్వాత దాడి చేయాలన్న సిద్ధాంతాన్ని నేర్పిందని విజయ్ తన చర్యను సమర్థించుకున్నారు. ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడినందునే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా మాట్లాడుతూ చట్టాలు చేయాల్సిన వ్యక్తే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. ఈ సంఘటన బీజేపీ నిజ స్వరూపాన్ని చూపిస్తుందని అన్నారు. కాగా, అధికారిపై దాడిచేయడంతో పోలీసులు విజయ్ను బుధవారం అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత తనకు బెయిల్ కావాలంటూ విజయ్ పెట్టుకున్న దరఖాస్తును స్థానిక కోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో సాయంత్రం సమయంలో అతన్ని జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
‘రేయ్.. నీ అంతు చూస్తా’ : టీడీపీ ఎమ్మెల్యే
వెంకటగిరి (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు. గతంలో సైదాపురం మండలంలో టీడీపీ నేతలకు మరుగుదొడ్లు, పింఛన్లు ఇవ్వాలని అధికారులపై తిట్ల దండకంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అది మరువకముందే రాపూరు ఉపాధి హామీ బే ఫుడ్ టెక్నికల్ అసిస్టెంట్ (బీఎఫ్‌టీఏ) వి.రామకృష్ణకు గురువారం ఉదయం ఫోన్ చేసి పోస్టల్ బ్యాలెట్ విషయమై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో అసభ్య పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉపాధి హామీ ఉద్యోగి మధ్య సాగిన ఫోన్ సంభాషణ ఇదీ.. ఉద్యోగి: సార్.. సార్.. ఎమ్మెల్యే: రేయ్.. నేను రా.. నీకు కూడు పెట్టింది. లం.. కొడకా. కూడు పెట్టినోడికి ఈ పని చేస్తావా? అందరినీ గుంపుగా పెట్టి మాట్లాడి అందరివీ ఇప్పిస్తావా (పోస్టల్ బ్యాలెట్లు).. వాళ్లకి? ఉద్యోగి: సార్.. సార్.. అది తప్పు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే: రేయ్.. నీ కథ నేను చూస్తారా. నీ అంతు చూస్తారా. వచ్చే గవర్నమెంట్ మాదే. నిలువునా.. నిలువునా నీ తాట తీస్తా. నీ అంతు చూస్తా. మొత్తం రాసిపెట్టాలే. ఐదు సంవత్సరాలు మేం ఉద్యోగం ఇచ్చి.. సాకితే మాకే ద్రోహం చేస్త్రారా మీరు. కడుపులో భయం ఉన్న వాళ్లయితే ఎవరికి ఇవ్వాలా. కడపులో భయం ఉందా నీకు? ఉద్యోగి: నిజం సార్. నాకు తెలీదు. ఎమ్మెల్యే: అబద్ధం చెప్పావంటే మెట్టుతో (చెప్పుతో) కొట్టేస్తా. నీకు ఇప్పుడు తెలియదులే.. తెలిసేరోజు తెలుస్తాదిలే. ఉద్యోగి: సార్.. సార్ ఒక్కరైనా నా దగ్గర ఇచ్చారని చెప్పమనండి సార్. నాకు నిజంగా తెలియదు సార్. ఎమ్మెల్యే: ఉండవురా నువ్వు. రేపు ఉండవు నువ్వు. నీకు ఎవరు ఇచ్చారో డైరెక్షన్ నీ అంతు చూస్తా. వాడికి బుద్ధి లేదు. నడమంత్రపు చావు చస్త్రారా మీరు. చూస్తాలే మీ కథ. నీవు ఏమేం చేస్తావో అంతా తెలుసు నాకు. అంతా పెట్టిస్తా. మీ అంతు చూస్తా. రేయ్.. రేపు ఉదయం రారా వెంకటగిరికి.. రేపు ఉదయం రా. ఉద్యోగి: సరే సార్! ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వినతి తన పోస్టల్ బ్యాలెట్‌తోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే అంతు చూస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ ఉపాధి హామీ ఉద్యోగి వి.రామకృష్ణ గురువారం వెంకటగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఎస్ మురళికి నెల్లూరులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గురువారం ఉదయం 10.44 గంటల సమయంలో ఎమ్మెల్యే రామకృష్ణ తనకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే శాఖాపరంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తానని, అంతు చూస్తానని బెదిరించారని తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణ రౌడీయిజం, గూండాయిజం, స్మగ్లింగ్ వంటి అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడని, తనకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పోలీస్ చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉద్యోగిని బెదిరించిన ఫోన్‌కాల్ గురువారం సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. -
బాబు సేవలో పబ్లిక్ ప్రాసిక్యూటర్
సాక్షి, విశాఖపట్నం: అతనొక పబ్లిక్ ప్రాసిక్యూటర్. సరిగ్గా ఏడాదిన్నర క్రితం పీపీగా నియమితులయ్యారు. ఇతని పదవీకాలం 2020 వరకు ఉంది. అంతకుముందు టీడీపీ సర్కార్ హయాంలోనే రెండుసార్లు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)గా పనిచేశారు. పైగా ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.20 వేలకు పైగా గౌరవ వేతనం తీసుకుంటున్నారు కూడా. విశాఖ నగరానికి చెందిన పి.ఎస్.నాయుడు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఇంతటి కీలక పదవిలో పని చేస్తున్న ఏ వ్యక్తి అయినా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆర్టికల్ – 21లో రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. కానీ ఇవేమీ తమకు పట్టనట్టుగా పీపీగా పనిచేస్తున్న పీఎస్ నాయుడు టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచార కార్యక్రమంలో తలమునకలవుతున్నారు. అంతేకాదు... తునిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో సీఎంతో కలిపి వేదిక పంచుకున్నారు. ఇది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎన్నికల నోడల్ అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే 27 శాతం ఐఆర్ ఇస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను స్వాగతించిన సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు రామాంజనేయులను విధులను నుంచి సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇలా టీడీపీ ఎన్నికల ప్రచారంలో అధికారికంగా పాల్గొంటున్న పీపీ పీఎస్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. -
మున్సిపల్ అధికారిపై చేయిచేసుకున్న హెరిటేజ్ ఉద్యోగి
-
వడ్డీ వ్యాపారి వేధింపులు..సెల్ఫీ సూసైడ్!
-
బిల్డింగ్‌పై నుంచి మహిళలను అసభ్యంగా వీడియో తీసి..
సాక్షి, కరీంనగర్: ఉన్నత విద్యను అభ్యసించి సర్కారు కొలువులో ఉన్న ఓ ఉద్యోగి బుద్ధి గడ్డితింది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి.. నడిబజారులో చెప్పుదెబ్బలు తిన్నాడు. బిల్డింగ్‌పై నుంచి చూస్తూ.. బాత్రూమ్కు వెళ్ళే మహిళలను సెల్ఫోన్లో చిత్రీకరించడంతో స్థానికులు సదరు ఉద్యోగిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. కరీంనగర్‌లోని జ్యోతి నగర్లో ఈ ఘటన జరిగింది. ఇక్కడే నివాసం ఉండే ఓదేలు ఎస్సారెస్పీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తన ఇంటి చుట్టుపక్కల మహిళలను తన సెల్ఫోన్లో వీడియోలు తీస్తూ అతను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అతన్ని పట్టుకున్నారు. ఇంట్లో నుంచి అతన్ని రోడ్డుపైకి లాక్కొచ్చి మహిళలు చెప్పులతో చితక్కొట్టారు. మహిళలతోపాటు స్థానిక యువకులు సైతం ఉద్యోగిపై చితకబాదారు. మహిళల కాళ్లు మొక్కించారు. ఉద్యోగి తల్లి అడ్డుకోగా ఆమెను సైతం స్థానికులు నెట్టేసి ఉద్యోగికి బుద్ది చెప్పారు. మరోసారి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించి వదిలేశారు. బాధితుడికి పెళ్లి అయినప్పటికీ ఆయన చేష్టలతో వేగలేక భార్య దూరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. -
మంత్రి సమక్షంలోనే టీడీపీ ఎమ్మెల్యే తిట్లపురాణం!
సాక్షి, విజయనగరం: టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సాక్షాత్తూ మంత్రి సమక్షంలోనే అధికారులపై తిట్లపురాణానికి తెరతీశారు. పార్వతీపురం పంచాయతీరాజ్ ఏఈని ఉద్దేశించి అప్పలనాయుడు దుర్భాషలాడారు. మంత్రి సుజయకృష్ణరంగారావు సమక్షంలోనే ఏఈని అప్పలనాయుడు తిట్టిపోసారు. -
సోయి మరిచి సినిమా చూస్తూ..!
-
సోయి మరిచి కంప్యూటర్లో సినిమా చూస్తూ!
న్యూఢిల్లీ: తాను పనిచేస్తున్నది ప్రభుత్వ కార్యాలయంలో అని మరిచిపోయి.. చుట్టు ఏం జరుగుతుందన్న సోయి కూడా లేకుండా కంప్యూటర్లో హాయిగా సినిమా చూస్తూ గడిపిన ఓ ఉద్యోగికి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఓవైపు రోగులు బయట వేచిచూస్తూ నానా అవస్థలు పడుతున్నా.. అదేమీ పట్టనట్టు కంప్యూటర్ తెరపై వస్తున్న సినిమాలో మునిగిపోయాడు ఆ ప్రబుద్ధుడు. ఏకంగా డిప్యూటీ సీఎం తనిఖీలు వచ్చినా ఆయనకు ఆ విషయం తెలియలేదు. డిప్యూటీ సీఎం నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి భుజం తట్టాడు. అప్పుడుగానీ ఆయన సినిమాలోకంలోంచి ఈ లోకంలోకి రాలేదు. ఇలా ఆకస్మిక తనిఖీ ద్వారా ఓ ప్రభుత్వ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఉద్యోగంలో తీసేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. కంప్యూటర్ లో సినిమా చూస్తున్న ఉద్యోగిని ప్రత్యక్షంగా పట్టుకున్న సంఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సిసోడియా 'ఇక్కడ ఇన్చార్జి ఎవరు? సినిమాలు చూడటానికి ఇక్కడికి వచ్చావా? ఆఫీసులో కంప్యూటర్లు సినిమాలు చూసేందుకు పెట్టారనుకున్నావా? సినిమాలు చూడాలని ఉంటే ఇంటికెళ్లి చూస్కో' అంటూ ఘటుగా వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆ ఉద్యోగిని కొలువులో నుంచి తీసేశారు. -
పిల్లలు పుట్టడం లేదని.. భార్యకు వేధింపులు
హైదరాబాద్ సిటీ : ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కాలేదని కారణంతో భార్యను వేధిస్తూ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. వివరాలు..నాగోలు ప్రాంతానికి చెంది న వసంతకుమార్ నగరంలోని ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వోద్యోగి. తొమ్మిది సంవత్సరాల క్రితం నగరానికి చెందిన సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. రెండు సంవత్సరాల నుంచి పిల్లలు కావడం లేదని వసంత్‌కుమార్ భార్య సరితను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో సరిత ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్, సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లలతో పాటు నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో ఇద్దరూ రాజీ కుదుర్చుకున్నారు. వారం రోజుల క్రితం భర్త వసంతకుమార్ సరితపై దాడిచేసి నాగోలు లలితా నగర్లో ఉంటున్న ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు, దీంతో కుటుంబసభ్యులతో ఇంటికి రాగా తాళం వేసి ఉండటంతో పాటు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సోమవారం సరిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు ఎవరూ న్యాయం చేయడం లేదని పేర్కొంది. -
కార్యాలయాల చెంతకే కూరలు
:ప్రభుత్వ ఉద్యోగుల కోసం కార్యాలయాల్లోనే కూరగాయల షాపులను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఆ శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి బుధవారం బూర్గుల రామకృష్ణారావు భవన్లో కూరగాయల ఔట్‌లెట్‌ను ప్రారంభించి ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. మాసబ్‌ట్యాంకులోని తెలుగు సంక్షేమ భవన్లో కూరగాయల ఔట్‌లెట్‌ను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి పారంభించారు. ఒక్కో రైతుబజార్ నుంచి రెండు ప్రభుత్వ కార్యాలయాలకు కూరగాయలు సరఫరా చేసేవిధంగా ప్రణాళిక రూపొందించినట్లు కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. వీటిని రైతుజార్ రేట్లకే అందిస్తామన్నారు. రైతుబజార్ల సీఈఓ ఎం.కె.సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘అంగన్వాడీ’ల అందోళన
‘అంగన్వాడీ’ల అందోళన ూడూరు టౌన్ ‘అంగన్వాడీ’లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎన్ స్వరూపారాణి డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం గూడూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్లు ముట్టడించి ఆందోళనకు దిగారు. అనంతరం ర్యాలీగా వెళ్లి టవర్‌క్లాక్ కూడలిలో మానవహారంగా నిలిచారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పని గంటలను పెంచి వేతనాలను మాత్రం పెంచకుండా వారి శ్రమను కొల్లగొడుతుందన్నారు. కార్యకర్తల విధులతో పాటు అదనంగా బీఎల్ఓ డ్యూటీలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఐసీడీఎస్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం వెంటనే మానుకోవాలన్నారు. అలాగే అమృతహస్తం, బాలబడులు, పెంచిన సెంటర్ అద్దెలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి సెంటర్‌కు గ్యాస్ సిలిండర్, నాసిరకం కొడిగుడ్లు కాకుండా మేలురకం గుడ్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, రమణయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాళ్లు హెప్సిబా, జ్యోతి, నాగమణి, సుశీల పాల్గొన్నారు.