కార్యాలయాల చెంతకే కూరలు | Fold offices vegetables | Sakshi
Sakshi News home page

కార్యాలయాల చెంతకే కూరలు

Published Thu, Mar 13 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

కార్యాలయాల చెంతకే కూరలు

కార్యాలయాల చెంతకే కూరలు

 :ప్రభుత్వ ఉద్యోగుల కోసం కార్యాలయాల్లోనే కూరగాయల షాపులను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఆ శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి బుధవారం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కూరగాయల ఔట్‌లెట్‌ను ప్రారంభించి ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

మాసబ్‌ట్యాంకులోని తెలుగు సంక్షేమ భవన్‌లో కూరగాయల ఔట్‌లెట్‌ను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి  పారంభించారు. ఒక్కో రైతుబజార్ నుంచి రెండు ప్రభుత్వ కార్యాలయాలకు కూరగాయలు సరఫరా చేసేవిధంగా ప్రణాళిక రూపొందించినట్లు కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. వీటిని రైతుజార్ రేట్లకే అందిస్తామన్నారు. రైతుబజార్ల సీఈఓ ఎం.కె.సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement