మరికొద్ది రోజుల్లో కేంద్రం బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టబోతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తులు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది పలు రాష్ట్రాలకు ఎన్నికలతో పాటు 2024లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్ ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు నిపుణులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ప్రజారంజకంగా బడ్జెట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వేతన జీవులు బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
పన్ను మినహాయింపుల మాటేమిటి
గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపు పన్నుపై కేంద్రం ఎటువంటి సంస్కరణలను ప్రకటించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో పన్ను విధానంలో మార్పు కీలకమైన డిమాండ్‌గా వినిపిస్తోంది. ఐచ్ఛిక ఆదాయపు పన్ను ప్రకటించబడినప్పటికీ, ఉపశమనం అందించే విషయంలో ఇది చాలా వరకు ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.
కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు చెబుతున్నారు. పాత ఆదాయపు పన్ను విధానంలో వర్తించే స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 పెంచాలని అనేక వినతులు వచ్చాయి. అలాగే కొన్ని మినహాయింపులను కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మరో వైపు అధ్వానంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో పాటు ఆర్థిక మాంద్యం ప్రభావాలు కలిసి రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కఠినమైన సవాలును ఎదుర్కొంటుందని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!
Comments
Please login to add a commentAdd a comment