హైదరాబాద్ సిటీ : ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కాలేదని కారణంతో భార్యను వేధిస్తూ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. వివరాలు..నాగోలు ప్రాంతానికి చెంది న వసంతకుమార్ నగరంలోని ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వోద్యోగి. తొమ్మిది సంవత్సరాల క్రితం నగరానికి చెందిన సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. రెండు సంవత్సరాల నుంచి పిల్లలు కావడం లేదని వసంత్‌కుమార్ భార్య సరితను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.
దీంతో సరిత ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్, సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లలతో పాటు నగరంలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో ఇద్దరూ రాజీ కుదుర్చుకున్నారు. వారం రోజుల క్రితం భర్త వసంతకుమార్ సరితపై దాడిచేసి నాగోలు లలితా నగర్‌లో ఉంటున్న ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు, దీంతో కుటుంబసభ్యులతో ఇంటికి రాగా తాళం వేసి ఉండటంతో పాటు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సోమవారం సరిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు ఎవరూ న్యాయం చేయడం లేదని పేర్కొంది.
పిల్లలు పుట్టడం లేదని.. భార్యకు వేధింపులు
Published Mon, Jul 13 2015 11:01 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement