ఇండోర్: ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై బీజేపీ సీనియర్ నాయకుడు కైలాశ్‌వర్గియా కుమారుడు, ఎమ్మెల్యే విజయ్‌వర్గియా క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను వెనక్కు వెళ్లిపోవాలంటూ స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగస్తుడైన విజయ్ బ్యాట్‌తో ప్రభుత్వోద్యోగిపై దాడి చేశాడు. బీజేపీ తమకు మొదట అభ్యర్థించాలని, తర్వాత దాడి చేయాలన్న సిద్ధాంతాన్ని నేర్పిందని విజయ్ తన చర్యను సమర్థించుకున్నారు. ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడినందునే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా మాట్లాడుతూ చట్టాలు చేయాల్సిన వ్యక్తే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. ఈ సంఘటన బీజేపీ నిజ స్వరూపాన్ని చూపిస్తుందని అన్నారు. కాగా, అధికారిపై దాడిచేయడంతో పోలీసులు విజయ్‌ను బుధవారం అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత తనకు బెయిల్ కావాలంటూ విజయ్ పెట్టుకున్న దరఖాస్తును స్థానిక కోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో సాయంత్రం సమయంలో అతన్ని జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment