indor
-
ఐఐఎం పరీక్షల్లో అంధురాలి ప్రతిభ
కనుచూపు లేక ముసిరిన చీకటిలో పట్టుదల కాంతిపుంజమై దారి చూపింది. రెప్పల మాటున దాగున్న కలలను చదువుతో సాకారం చేసుకుంది.అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించే ఐ.ఐ.ఎం. (ఇండియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి దేశంలోని 21 ఐ.ఐ.ఎం. కళాశాలల్లోని 19 కళాశాలల్లో అర్హత సాధించింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మహెలాలకు చెందిన కొత్తకాపు శివాని భవిష్యత్తుకు నిర్మించుకుంటున్న సోపానాలను ఇలా మన ముందుంచింది.‘మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు కొత్తకాపు విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డిలకు రెండోసంతానాన్ని. మా అక్క కీర్తన గ్రూప్ 4 పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. మా చెల్లి భవానికి 80 శాతం చూపులేదు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంబీఏ సీటును సాధించింది. నాకు పుట్టుకతోనే చూపు లేదు. అయినా, చదువంటే మాకెంతో ఆసక్తి. అదే మమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని మా నమ్మకం. జహీరాబాద్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిరంలో నా ప్రైమరీ చదువు ఆరంభమైంది. కానీ, చూపు లేక΄ోవడంతో చాలా ఇబ్బంది పడేదాన్ని. నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమ్మానాన్నలు హైదరాబాద్‌లోని బేగంపేటలో గల దేవనార్ పబ్లిక్ స్కూల్లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు అదే బడిలో చదువుకున్నాను. పదోతరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్మీడియెట్‌ను జహీరాబాద్‌లోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో కామర్స్‌తో పూర్తి చేశాను. కాలేజీలో క్లాసులను విని, సహాయకులతో పరీక్షలు రాశాను. ఆ రెండేళ్లూ కాలేజీ టాపర్‌గా నిలిచాను.ఉన్నతస్థాయి ఉద్యోగమే లక్ష్యంచెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి బీబీఏ కోర్సు పూర్తి చేశాను. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆ¯Œ ౖలñ న్లో కోచింగ్ తీసుకున్నాను. 2023లో నిర్వహించిన ఐఐఎం ప్రవేశ పరీక్ష రాసి 93.51 శాతం మార్కులతో దేశంలోని 21 ఐఐఎం కళాశాలల్లోని 19 కళాశాలల్లో ప్రవేశార్హత సాధించాను. వాటిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఐఐఎంను ఎంపిక చేసుకున్నాను. కిందటి నెల 23న కళాశాలలో చేరాను.శక్తినిచ్చే గీతోపదేశం చూపు లేక΄ోవడంతో చదువు కష్టంగా ఉండేది. బ్రెయిలీ లిపి నేర్చుకునేంతవరకు చదువు పట్ల నాకున్న తపనను ఎలా తీర్చుకోవాలో తెలిసేది కాదు. అంధుల పాఠశాలలో చేరాక నాకు పెద్ద అండ దొరికినట్టుగా అనిపించింది. కార్పొరేట్ కంపెనీలలో టాప్ లెవల్ ఉద్యోగం చేయాలని ఉంది. అందుకు తగిన అర్హతలు సం΄ాదించుకోవడానికి స్పెషలైజేషన్ కూడా చేస్తాను. శ్రీకృష్ణుడి గీతోపదేశం వింటూ ఉంటాను. జీవితంలోని ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలో గీత ద్వారానే నేను తెలుసుకుంటున్నాను. రెండు సంవత్సరాల ఐఐఎం కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని సాధించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్నలకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలన్నదే నా ఆకాంక్ష’’ అని చెప్పింది శివాని. – యెర్భల్ శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి, జహీరాబాద్ఎంతో గర్వంగా ఉందిమా అమ్మాయి శివానీ జాతీయ స్థాయిలో ఐఎంఎ సీటును సాధించడం మాకెంతో గర్వంగా ఉంది. ఆమె పుట్టుగుడ్డిగా పుట్టినప్పుడు కొంత బాధపడ్డాం. కొందరు మనసు నొప్పించే మాటలు అనేవారు. కానీ, వాటిని పట్టించుకోకుండా అమ్మాయిలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో కష్టపడి చదివించాం. ఇప్పుడు శివానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. – విజయలక్ష్మి, గో΄ాల్రెడ్డి -
అక్కడ పరిస్థితి సీరియస్
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం తాము ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను కొన్ని రాష్ట్రాలు సరిగ్గా అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రాష్ట్రాలు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన నిబంధనలు విధించవచ్చు కానీ.. కేంద్రం ప్రకటించిన నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ముంబై, పుణెల్లో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, రాజస్తాన్‌లోని జైపూర్‌లో, పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్, నార్త్ 24 పరగణ, డార్జిలింగ్, జల్పయిగురి, కలింపాంగ్ల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఆరు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయని సోమవారం ప్రకటించింది. వారు లాక్డౌన్ నిబంధనల అమలులో చోటు చేసుకున్న లొసుగులను గుర్తించి నివేదిక రూపొందిస్తారని పేర్కొంది. అలాగే, ఆయా ప్రాంతాల్లో కోవిడ్–19 చికిత్స కోసం తీసుకున్న చర్యలు, వైద్యులకు అవసరమైన పీపీఈల అందుబాటు.. మొదలైనవాటిని సమీక్షిస్తారని తెలిపింది. అనంతరం, అవసరమైన చర్యలపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తాయని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని అదనపు కార్యదర్శి హోదాతో ఉన్న అధికారి నేతృత్వంలోని ఒక్కో బృందంలో ఐదుగురు అధికారులు ఉంటారని పేర్కొంది. ఆయా అధికారులకు వసతులను ఆయా రాష్ట్రాలు కల్పించాలని కోరింది. కరోనా కట్టడిలో రాష్ట్రాలకు సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ 4 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బందిపై దాడులు, మార్కెట్లు, బ్యాంకులు, రేషన్ షాపుల వద్ద వ్యక్తిగత దూరం పాటించకపోవడం, ప్రయాణికులతో వాహనాలు రాకపోకలు సాగించడం.. మొదలైన ఆంక్షల ఉల్లంఘన తమ దృష్టికి వచ్చినట్లు హోం శాఖ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రం ప్రకటించిన నిబంధనలను పాటించాలని కోరుతూ హోం శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మమత సీరియస్ లాక్డౌన్ ఉల్లంఘనలను పరిశీలించేందుకు కేంద్రం అధికార బృందాలను పంపిస్తుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఏ ప్రాతిపదికన వారు కేంద్ర బృందాలను పంపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సరైన కారణాలు చూపకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమన్నారు. కేరళపై ఆగ్రహం అవసరమైతే మరింత కఠిన నిబంధనలు విధించండి కాని కేంద్రం ప్రకటించిన ఆంక్షలను మాత్రం సడలించవద్దు అని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి సడలింపులు తమ దృష్టికి వచ్చాయంది. రెస్టారెంట్లు, క్షౌర శాలలను, స్టేషనరీ షాప్స్ను, పట్టణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, పట్టణాల్లో రవాణాను అనుమతించడంపై కేరళపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేరళ ప్రధాన కార్యదర్శి టామ్ జోస్‌కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. లాక్డౌన్ నిబంధనలతో పాటు, వాటికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కేరళ ఉల్లంఘిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లాక్డౌన్ సడలింపులను రద్దు చేసుకుంటున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. -
అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే
ఇండోర్: ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై బీజేపీ సీనియర్ నాయకుడు కైలాశ్వర్గియా కుమారుడు, ఎమ్మెల్యే విజయ్‌వర్గియా క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను వెనక్కు వెళ్లిపోవాలంటూ స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగస్తుడైన విజయ్ బ్యాట్‌తో ప్రభుత్వోద్యోగిపై దాడి చేశాడు. బీజేపీ తమకు మొదట అభ్యర్థించాలని, తర్వాత దాడి చేయాలన్న సిద్ధాంతాన్ని నేర్పిందని విజయ్ తన చర్యను సమర్థించుకున్నారు. ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడినందునే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా మాట్లాడుతూ చట్టాలు చేయాల్సిన వ్యక్తే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. ఈ సంఘటన బీజేపీ నిజ స్వరూపాన్ని చూపిస్తుందని అన్నారు. కాగా, అధికారిపై దాడిచేయడంతో పోలీసులు విజయ్ను బుధవారం అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత తనకు బెయిల్ కావాలంటూ విజయ్ పెట్టుకున్న దరఖాస్తును స్థానిక కోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో సాయంత్రం సమయంలో అతన్ని జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఏకే 47 తో విద్యార్థులు.. ఇండోర్ లో కలకలం
భోపాల్: మధ్యప్రదేశ్ లో కాలేజ్ ఫంక్షన్ లో విద్యార్థులు ఏకే 47 గన్ తో డాన్స్ చేయడం కలకలం రేపుతోంది. ఇండోర్ లోని హోల్కర్ సైన్స్ కాలేజ్ 125 వ వార్షికోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు ఏకే 47 ను పట్టుకొని డాన్సులు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకోగా, విద్యార్థులు పారిపోయారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు, కాలేజీ యాజమాన్యం పైనా చర్యలు తీసుకోనున్నట్టు పోలీసు అధికారి తెలిపారు.