Cricket bat
-
బ్యాట్ గుర్తు ఇమ్రాన్ పార్టీదే
పెషావర్: పాకిస్థాన్‌లో కీలకమైన జాతీయ ఎన్నికల ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కి భారీ ఊరట దొరికింది. పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను దానికే తిరిగి కేటాయిస్తూ పెషావర్ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. పీటీఐకి బ్యాట్ చిహ్నాన్ని రద్దు చేస్తూ దేశ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. -
కొడుకు ముందే క్రికెట్ బ్యాట్‌తో ప్రిన్సిపల్‌పై భార్య దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
గృహహింస.. ఈ పేరు వినగానే వేధింపులకు గురవుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. భర్తలు, అత్త మామలు, ఆడపడచుల చిత్ర హింసలకు ఎంతోమంది వివాహితలు బలవుతున్నారు. కానీ భార్య చేతిలో గృహహింసకు గురవుతున్న భర్తల గురించి ఎప్పుడైనా విన్నారా.. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అజిత్‌సింగ్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాకు చెందిన సుమన్‌ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట అల్వార్ జిల్లాలో నివాసముంటున్నారు. కాగా అజిత్ సింగ్ ఓ విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య సుమన్ తరుచూ అజిత్‌సింగ్‌పై చేయి చేసుకోవడం ప్రారంభించింది. అనేకసార్లు భర్తను ఇష్టంవచ్చినట్లు కొట్టేది. దీంతో భార్య చేతిలో గాయాలపాలైన అజిత్ సింగ్ ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే భార్య హింసతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్య మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలంటూ కోర్టును కోరాడు. చేతికి ఏది దొరికితే అది క్రికెట్ బ్యాట్, పాన్, కర్రలతో దాడి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో భార్య భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే తల్లి దెబ్బలకు బెదిరిపోయిన కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతుండటం కూడా చూడవచ్చు. ఈ కేసును విచారించిన కోర్టు సదరు బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది. చదవండి: అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం అయితే గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉన్నందున భార్య వేధింపులపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని బాధితుడు అజిత్ సింగ్ తెలిపాడు. కానీ ఇప్పుడామే హద్దులు దాటి ప్రవర్తిస్తుండటంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. తన బావ భార్యను హింసకు ప్రేరేపించాడని ఆరోపించాడు. అంతేగాక భార్యపై తనెప్పుడూ చేయి ఎత్తలేదని పేర్కొన్నాడు. తనొక ఉపాధ్యాయుడని..ఉపాధ్యాయుడు ఒక మహిళపై చేయి ఎత్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఇష్టం లేదని అన్నాడు. In a strange case of domestic violence, a school principal in #Alwar district of #Rajasthan has move the court seeking protection from the physical and mental harassment of his wife. According to the man, his wife has been beating him black and blue leaving him weak mentally. pic.twitter.com/J1UOmRhyHw — IANS (@ians_india) May 25, 2022 -
ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ..
World Biggest Cricket Bat Unveiled In Hyderabad: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బ్యాట్ హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై శనివారం ఆవిష్కరించబడింది. పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బ్యాట్ పొడవు 56.1 అడుగులు కాగా, బరువు 9 టన్నులుగా ఉంది. పాప్లర్ ఉడ్‌తో తయారు చేసిన ఈ బ్యాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకు విషెస్ చెబుతూ.. ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్‌ను ట్యాంక్ బండ్‌పై ఉంచారు. ఈ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, తెలంగాణ పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే -
కష్టాల్లో అష్రఫ్, ఆదుకున్న సచిన్
ముంబై: దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్ చౌదరీ అనే పెద్దాయనను ఆర్థికంగా ఆదుకున్నారు. గతంలో పాడైన సచిన్ బ్యాట్లను అష్రప్ బాగు చేసేవాడు. అష్రఫ్ స్నేహితుడు ప్రశాంత్ జఠ్మలాని తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం సాగకపోవడంతో అష్రఫ్ చాచాను తీవ్ర ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింది. 12 రోజుల క్రితం ముంబైలోని సాల్వా ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయం తెలుకున్న సచిన్ ఆస్పత్రికి వచ్చి అష్రఫ్‌ను పరామర్శించాడు. ఆస్పత్రి ఖర్చులు భరించడంతోపాటు, ఆర్థిక సాయం కూడా చేశాడు. విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, క్రిస్‌గేల్, కీరన్ పొలార్డ్ బ్యాట్లను కూడా అష్రఫ్ బాగు చేసేవాడు. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. ఎంతో మంది యువ క్రికెటర్ల పాడైన బ్యాట్లను ఉచితంగా సరిచేసి ఇచ్చేవాడు. వాంఖడే స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు క్రమం తప్పకుండా వీక్షించేవాడు’అని ఓ జాతీయ మీడియాతో మంగళవారం పేర్కొన్నాడు. (చదవండి: ‘టిక్‌టాకర్లతో పాటు మమ్మల్నీ పట్టించుకోండి’) -
క్రికెట్ బ్యాట్ తో భర్త మర్మాంగాలపై కొట్టి..
చిత్తూరు,పలమనేరు: మండలంలోని మొరం పంచాయతీ నక్కపల్లిలో బుధవారం భార్య, ఆమె తల్లి కలిసి క్రికెట్ బ్యాట్, రోకలితో కొట్టి భర్తను హత్య చేశారు. పట్టణ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోపీనాథ్ రెడ్డి (36) కి అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీత(32)తో కలిసి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. గోపీనాథ్ రెడ్డి కొన్నాళ్ల క్రితం బెంగకూరు వెళ్లి అక్కడే సొంతంగా క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం కుటుంబంతోపాటు స్వగ్రామానికి వచ్చి అత్తాగారింట్లో ఉంటున్నారు. డ్యూలు కట్టకపోవడంతో కారును ఫైనాన్స్ కంపెనీవారు ఇటీవల తీసుకెళ్లారు. దీంతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉపాధి పొందాలని గోపీనాథ్‌రెడ్డి భావించాడు. అందుకు నగలు ఇవ్వా లని భార్యను అడిగాడు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి గోపీనాథ్‌రెడ్డి నగల విషయంపై భార్య, అత్తతో గొడవపడ్డాడు. ఆగ్రహం చెందిన భార్య క్రికెట్ బ్యాట్, అత్త రోకలితో మద్యం మత్తులో ఉన్న అతన్ని చితకబాదారు. ఈ క్రమంలో అతని మర్మాంగాలకు తీవ్రగాయాలయ్యాయి. పురుషాంగం కొంత తెగింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య చేసింది తామేనంటూ భార్య, అత్త పోలీసులకు తెలిపారు. మృతునికి తొమ్మిదేళ్ల కుమారుడున్నాడు. సీఐ శ్రీధర్ కేసును విచారిస్తున్నారు. అందరితో కలిసిమెలసి ఉండే గోపీనాథ్‌రెడ్డి హత్య గ్రామంలో కలకలం రేపింది. -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
విమానంలో హర్బజన్‌కు చేదు అనుభవం
తమిళనాడు ,టీ.నగర్: విమానంలో క్రికెటర్ హర్బజన్‌సింగ్ క్రికెట్ బ్యాట్ శనివారం చోరీకి గురైంది. భారత క్రికెటర్ మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్. ఇతను ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నారు. హర్బజన్ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్ బ్యాగ్‌ను పరిశీలించగా అందులోని క్రికెట్ బ్యాట్ మాయమైంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అతను వెంటనే తన ట్విట్టర్ ద్వారా విమాన సంస్థకు ఫిర్యాదు చేశారు. అందులో క్రికెట్ కిట్‌లోని బ్యాట్ చోరీకి గురైందని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు విమాన సంస్థ అధికారి బ్యాట్ ఆచూకీ కనుగొని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. No news from you guys yet about my bat missing from my kitbag @IndiGo6E are you guys not taking it seriously or what ??? — Harbhajan Turbanator (@harbhajan_singh) March 8, 2020 -
ఒక్కసారి బ్యాటింగ్ మొదలుపెడితే..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ బ్యాట్ తయారు చేసేందుకు కెనెడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. నాణ్యమైన కశ్మీరీ, ఇంగ్లిష్ విల్లోను ఎంపిక చేయడమే కాకుండా.. కంప్యూటర్ మోడలింగ్, సమర్థత పెంచేందుకు పనికొచ్చే అల్గారిథమ్‌లను ఇందులో వాడటం విశేషం. ‘అల్గోబ్యాట్’అని పిలుస్తున్న ఈ కొత్తరకం బ్యాట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ బ్యాట్‌కు ఏమాత్రం తీసిపోదని.. అందరికీ అందుబాటులోనే ధర ఉంటుందని ఫిల్ ఎవన్స్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. విరాట్ క్లోహ్లీ, స్టీవ్ స్మిత్, ఇయాన్మోర్గన్ వంటి ఆటగాళ్ల స్ఫూర్తిగా క్రికెట్లోకి అడుగుపెట్టే పిల్లలకు మంచి బ్యాట్ కొనడం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి బ్యాట్ ఖరీదు లక్షల్లో ఉండగా.. తమ ఆల్గోబ్యాట్ ఖరీదు రెండు మూడు వేల కంటే ఎక్కువ ఉండదని ఎవన్స్ తెలిపారు. బ్యాట్ జ్యామితిని మార్చడం ద్వారా బంతి తగిలినప్పుడు అతితక్కువ కంపించడం, తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం వెళ్లడం ఈ ఆల్గోబ్యాట్ ప్రత్యేకతలని వివరించారు. ఆల్గోబ్యాట్ డిజైన్‌తో సాధారణ కలపతోనూ అత్యుత్తమమైన బ్యాట్లు తయారు చేయొచ్చని, ఆయా కలప రకానికి తగ్గట్లు డిజైన్ మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆల్గోబ్యాట్ నమూనాలను పరీక్షిస్తున్నామని.. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మార్కెట్లోకి ప్రవేశపెడతామని వెల్లడించారు. -
బ్యాట్‌తో దాడి ; ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
ఇండోర్ : మున్సిపల్ సిబ్బందిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి అరెస్టయిన ఇండోర్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ వర్గియా కుమారుడు, ఆకాష్ విజయ్‌వర్గియా బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన విడుదల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి వేడుక చేసుకున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు దగ్గర ఆయన అనుచరుడు ఒకరు గన్‌తో హల్చల్ చేశారు. గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. (చదవండి : అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే) ఇండోర్‌లో విజయ తిలకాలు, పూల దండలు,మిఠాయిలతో ఆకాష్‌కి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిన కూల్చడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసినందుకు ఆకాష్ వర్గియా అరెస్ట్ అయ్యారు. -
అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే
ఇండోర్: ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై బీజేపీ సీనియర్ నాయకుడు కైలాశ్వర్గియా కుమారుడు, ఎమ్మెల్యే విజయ్‌వర్గియా క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను వెనక్కు వెళ్లిపోవాలంటూ స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగస్తుడైన విజయ్ బ్యాట్‌తో ప్రభుత్వోద్యోగిపై దాడి చేశాడు. బీజేపీ తమకు మొదట అభ్యర్థించాలని, తర్వాత దాడి చేయాలన్న సిద్ధాంతాన్ని నేర్పిందని విజయ్ తన చర్యను సమర్థించుకున్నారు. ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడినందునే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా మాట్లాడుతూ చట్టాలు చేయాల్సిన వ్యక్తే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. ఈ సంఘటన బీజేపీ నిజ స్వరూపాన్ని చూపిస్తుందని అన్నారు. కాగా, అధికారిపై దాడిచేయడంతో పోలీసులు విజయ్ను బుధవారం అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత తనకు బెయిల్ కావాలంటూ విజయ్ పెట్టుకున్న దరఖాస్తును స్థానిక కోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో సాయంత్రం సమయంలో అతన్ని జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇమ్రాన్‌కు బ్యాటు బహుమానం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కాబోయే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరిద్దరు చర్చించారు. సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లు తదితర అంశాలపై ఇమ్రాన్ వద్ద అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ చీఫ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున అజయ్ అభినందించారు. భారత క్రికెట్ జట్టు సంతకాలు చేసిన బ్యాట్‌ను బహూకరించారు. భారత్–పాక్ చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ఇమ్రాన్ ఆకాంక్షించారు. ఇస్లామాబాద్‌లో త్వరలో జరగనున్న సార్క్ సదస్సలో భారత్ పాల్గొనాలని కూడా ఆయన కోరారు. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పీటీఐ ప్రకటించింది. భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, సునీల్ గావస్కర్‌లను ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొంది. ఆగస్టు 13 నుంచి పాక్ పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కాగా, పార్లమెంటు ఎన్నికల్లో బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్ ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ అరుదైన గిఫ్ట్
న్యూఢిల్లీ: కాబోయే పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపురూపమైన కానుకను పంపించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్‌కూడా అయిన్ ఖాన్‌కు క్రికెట్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా పంపించారు. భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ సంతకాలు చేసిన ఈ అరుదైన క్రికెట్ బ్యాట్‌ను భారత హై కమిషనర్ అజయ్ బిసారియా శుక్రవారం ఇమ్రాన్‌ఖాన్‌కు అందించారు. రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలపై చర్చించేందుకు భారత రాయబారి అజయ్ బిసరియా పాకిస్థాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇమ్రాన్ ఖాన్,ఇతర ఉన్నతాధికారులను పిలిచి ప్రధాని మోదీ తరఫునఈ బ్యాట్‌ను బహుకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధించిన ఘనవిజయానికి గాను అభినందనలు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సెనేటర్ ఫైసల్ జావేద్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముగ్గురు మాజీ భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూ, సునీల్ గవాస్కర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కాగా జూలై 26న జరిగిన ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ 116 సీట్లను గెలుచుకుని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇమ్రాన్ అభినందించిన సంగతి తెలిసిందే. Indian HC Ajay Bisaria called on Mr Imran Khan, Chairperson & senior leadership of PTI. HC congratulated @ImranKhanPTI on his electoral success, discussed range of issues, prospects of India-Pak relationship. HC gifted a cricket bat autographed by the entire Indian cricket team. pic.twitter.com/xtdZ8H8ZQ5 — India in Pakistan (@IndiainPakistan) August 10, 2018 -
శ్రీకాంత్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనికి ఉన్న అభిమానుల్లో సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అందులో భారత స్టార్ షటర్ల్ కిడాంబి శ్రీకాంత్ ఒకడు. ఎంఎస్ ధోనికి తానొక పెద్ద అభిమానిగా శ్రీకాంత్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు కూడా. అయితే తాజాగా శ్రీకాంత్‌కు ధోని నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అందింది. తనకు విషెష్ చెబుతూ ధోని ఒక క్రికెట్ బ్యాట్ ఇచ్చిన విషయాన్ని శ్రీకాంత్ ట్వీటర్ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు ధోని ధన్యవాదాలు తెలిపిన శ్రీకాంత్.. అదొక అద్భుతమైన కానుకగా పేర్కొన్నాడు. తన అనుభూతిని, ఆనందాన్ని మాటల్లో చెప్పడం వీలు కావడం లేదంటూ శ్రీకాంత్ ఉబ్బితబ్బిబ్బి అవుతున్నాడు. Thank you @msdhoni for the wonderful gift and can’t tell how happy I am. This just made my day.🤩😁 #MSDhoni #fanmoment pic.twitter.com/0wJhiOsaFW — Kidambi Srikanth (@srikidambi) 20 May 2018 -
అనుమానం పెనుభూతమై..
పెందుర్తి: కట్టుకున్న భార్యపై అనుమానం పెనుభూతమైంది. చివరకు కాలయముడైన భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. పెందుర్తి నడిబొడ్డున సంచలనం రేపిన ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెందుర్తిలోని యాతపేటకు చెందిన మునస మహాలక్ష్మినాయుడు, రాజరాజేశ్వరి(38) దంపతులు పాతూరులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. మహాలక్ష్మినాయుడు ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా రాజరాజేశ్వరి గాజువాకలోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. కొన్నాళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. తరచూ అనుమానాలతో భార్యాభర్తలకు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శుక్రవారం వీరి మధ్య ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. మాటమాట పెరిగి క్షణికావేశానికి గురైన మహాలక్ష్మి భార్య రాజరాజేశ్వరి తలపై ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో కొట్టాడు. కుప్పకూలిపోయిన రాజేశ్వరి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజరాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరి సంతానం కుమార్తె శ్వేత డిగ్రీ, కుమారుడు సాయి ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. పెందుర్తి సీఐ జె.మురళీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గణేశుడి రూపంలో బీసీసీఐ
జొహన్నెస్‌బర్గ్: గణేశుడి రూపంలో బీసీసీఐ... ఓ చేతిలో క్రికెట్ బ్యాట్... ఇతర చేతుల్లో డబ్బుల కట్టలు... కాళ్ల దగ్గర బలి పీఠంపై క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈఓ హరూన్ లోర్గాట్. డబ్బుల కోసం ఆయన్ని బలి ఇస్తున్నట్లుగా సీఎస్ఏ బోర్డు పెద్దలు... జొనాథన్ షాపిరో అనే కార్టూనిస్ట్ గీసిన ఓ కార్టూన్... దక్షిణాఫ్రికాలో వివాదానికి దారితీసింది. వివరాళ్లోకి వెళ్తే.... లోర్గాట్పై ఆగ్రహంతో సఫారీ టూర్‌ను సందిగ్దంలో పడేసిన బీసీసీఐని.. దక్షిణాఫ్రికా బోర్డు కాళ్లావేళ్లా పడి ఒప్పించుకుంది. చివరకు ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టూర్‌ను కుదించుకోవడానికి కూడా అంగీకరించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో లోర్గాట్‌ను బలి పశువును చేశారు. చివరకు భారత్‌తో క్రికెట్ గురించి అతనికి మాట్లాడే అర్హత లేకుండా చేశారు. ఇదంతా కేవలం బీసీసీఐవిసిరే డబ్బు కట్టల కోసమేనన్నది అక్కడి విమర్శకుల స్పందన. దీంతో బీసీసీఐ, సీఎస్ఏల మధ్య ఉన్న సంబంధాలను షాపిరో కార్టూన్ రూపంలో వ్యక్తపరిచారు. ఇది ‘సండే టైమ్స్’లో రావడంతో తమ మనోభావాలను కించపరిచారంటూ హిందూ మతవాద సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. పత్రిక యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని దక్షిణాఫ్రికా హిందూ ధర్మ సభ (ఎస్ఏహెచ్డీఎస్), హిందూ మహా సభ, తమిళ సమాఖ్యలు డిమాండ్ చేశాయి. -
రూ. 4.5 లక్షలు పలికిన క్రికెట్ బ్యాట్
ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్ వేలంలో భారీ ధర పలికింది. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడిన బ్యాట్‌ను ఇటీవల వేలంగా వేయగా 4.5 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్న అన్ని దేశాల జట్ల క్రికెటర్లు బ్యాట్‌పై సంతకాలు చేశారు. భారత స్పిన్ దిగ్గజం ఎర్రాపల్లి ప్రసన్న దీన్ని సేకరించారు. ఈ నెల 13న ముంబైలో ఈ బ్యాట్‌తో సహా అరుదైన క్రీడా వస్తువుల్ని వేలం వేశారు. భారత తొలి టెస్టు జట్టు దిగిన ఫొటోను 90 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. 1932 ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ సందర్భంగా దిగిన ఫొటోపై అప్పటి టీమిండియా కెప్టెన్ సి.కె.నాయుడు సంతకం చేశాడు. ఇక టెస్టుల్లో హర్భజన్ 400వ వికెట్ తీసిన సందర్భంగా ధరించిన జెర్సీ 2.16 లక్షలకు, శ్రీలంకతో ఓ టెస్టులో హైదరాబాదీ స్టయిలిష్ వీవీఎస్ లక్ష్మణ్ అజేయ సెంచరీ చేసినప్పుడు వేసుకున్న గ్లౌవ్స్ 1.80 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇతర మాజీ క్రికెటర్లు సంతకాలు చేసిన పుస్తకాలు, బ్యాట్లు కూడా భారీ ధర పలికాయి.