కష్టాల్లో అష్రఫ్‌, ఆదుకున్న సచిన్‌ | Sachin Financial Aid To Ashraf Chaudhary Who Once Fixed His Bats | Sakshi
Sakshi News home page

అష్రఫ్‌పై సచిన్‌ టెండూల్కర్‌ పెద్ద మనసు

Published Wed, Aug 26 2020 9:13 AM | Last Updated on Wed, Aug 26 2020 11:07 AM

Sachin Financial Aid To Ashraf Chaudhary Who Once Fixed His Bats - Sakshi

ముంబై: దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్‌ చౌదరీ అనే పెద్దాయనను ఆర్థికంగా ఆదుకున్నారు. గతంలో పాడైన సచిన్‌ బ్యాట్లను అష్రప్‌ బాగు చేసేవాడు. అష్రఫ్‌ స్నేహితుడు ప్రశాంత్‌ జఠ్మలాని తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం సాగకపోవడంతో అష్రఫ్‌ చాచాను తీవ్ర ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా  దెబ్బతింది. 12 రోజుల క్రితం ముంబైలోని సాల్వా ఆస్పత్రిలో చేరాడు.

ఈ విషయం తెలుకున్న సచిన్‌ ఆస్పత్రికి వచ్చి అష్రఫ్‌ను పరామర్శించాడు. ఆస్పత్రి ఖర్చులు భరించడంతోపాటు, ఆర్థిక సాయం కూడా చేశాడు. విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, క్రిస్‌గేల్‌, కీరన్‌ పొలార్డ్‌ బ్యాట్లను కూడా అష్రఫ్‌ బాగు చేసేవాడు. క్రికెట్‌ అంటే అతనికి ప్రాణం. ఎంతో మంది యువ క్రికెటర్ల పాడైన బ్యాట్లను ఉచితంగా సరిచేసి ఇచ్చేవాడు. వాంఖడే స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్‌ మ్యాచ్‌లు క్రమం తప్పకుండా వీక్షించేవాడు’అని ఓ జాతీయ మీడియాతో మంగళవారం పేర్కొన్నాడు.
(చదవండి: ‘టిక్‌టాకర్లతో పాటు మమ్మల్నీ పట్టించుకోండి’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement