
హైదరాబాద్: కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. పలు ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ పాత వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో స్నేహితులతో కలిసి తన ఫామ్‌హౌజ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ పెద్ద కర్ర పట్టుకొని చెట్టు నుంచి నిమ్మకాయలను తెంపుతున్నాడు. దీనిని ఓ స్నేహితుడు వీడియో తీయగా మరో స్నేహితుడు కామెంటరీ ఇచ్చాడు. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తి పొరపాటున నిమ్మకాయను మామిడికాయ అన్నాడు.
దీంతో సచిన్ వెంటనే అతని తప్పును సరి చేస్తూ.. ‘అరె భయ్యా ఇది మామిడి కాయ కాదు నిమ్మకాయ’ అని అన్నాడు. ఇక ఈ వీడియో గతంలో తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా ఆ పాత వీడియోను హర్భజన్ రీపోస్ట్ చేస్తూ.. ‘సచిన్ 2/3 నిమ్మకాయలు నాక్కూడా ఇవ్వవా’ అంటూ ఓ సరదాగా కామెంట్ జతచేశాడు. ప్రస్తుతం సచిన్‌కు సంబంధించిన భజ్జీ షేర్ చేసిన పాత వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
చదవండి:
టి20 వరల్డ్ కప్ వాయిదా పడితేనే...
నేనొక డైనోసర్‌ను చూశాను: అనుష్క
.@YUVSTRONG12 😀 - @sachin_rt 😎 - @ImRo45 🙃 - @harbhajan_singh 👶#StayAtHome and enjoy this 💙#OneFamily pic.twitter.com/4zXLUvqBrg
— Mumbai Indians (@mipaltan) May 18, 2020