
డెవాల్డ్ బ్రెవిస్.. దక్షిణాఫ్రికాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఒక సంచలనం. ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో బ్రెవిస్ 506 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. జూనియర్ ఏబీగా మన్ననలు పొందిన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ బ్రెవిస్‌ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ తరపున బ్రెవిస్ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకుంటాడేమో చూడాలి.
ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ముంబై ఇండియన్స్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఇంటర్య్వూ చేసింది. ఆ ఇంటర్య్వూలో తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని పేర్కొన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో జూనియర్ ఏబీ తన క్రికెట్ రూంను చూపించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తొలుత తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫోటోను చూపించాడు. మాస్టర్ బ్లాస్టర్ ఫేమస్ షాట్ అప్పర్‌కట్‌తో ఇచ్చిన ఫోజును పెద్ద ఫోటోగా బ్రెవిస్ తన రూంలో పెట్టుకున్నాడు.
ఆ తర్వాత మరో మాజీ టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫోటోను చూపించాడు. యాదృశ్చికంగా సచిన్, హర్భజన్‌లు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు బ్రెవిస్ కూడా ముంబై తరపున ఆడనున్నాడు. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ 15వ సీజన్ జరగనుంది. తొలుత 25శాతం ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
చదవండి: Kohli 100th Test: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు
Mohammed Siraj: సిరాజ్‌కు ప్రమోషన్.. ఇకపై ఎంత జీతం అంటే!
Comments
Please login to add a commentAdd a comment