బ్యాట్‌తో దాడి ; ఎమ్మెల్యేకు ఘన స్వాగతం  | BJP MLA Akash Vijayvargiya Released On Bail | Sakshi
Sakshi News home page

బ్యాట్‌తో దాడి ; ఎమ్మెల్యేకు ఘన స్వాగతం 

Published Sun, Jun 30 2019 1:27 PM | Last Updated on Sun, Jun 30 2019 1:27 PM

BJP MLA Akash Vijayvargiya Released On Bail - Sakshi

ఇండోర్‌ : మున్సిపల్‌ సిబ్బందిపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసి అరెస్టయిన ఇండోర్‌ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నేత కైలాశ్‌ విజయ వర్గియా కుమారుడు, ఆకాష్‌ విజయ్‌వర్గియా బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన విడుదల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి వేడుక చేసుకున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు దగ్గర ఆయన అనుచరుడు ఒకరు గన్‌తో హల్‌చల్‌ చేశారు. గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

(చదవండి : అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే)

ఇండోర్‌లో విజయ తిలకాలు, పూల దండలు,మిఠాయిలతో ఆకాష్‌కి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు  ఘన స్వాగతం పలికారు. అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిన కూల్చడానికి వచ్చిన ప్రభుత‍్వ ఉద్యోగిపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసినందుకు ఆకాష్‌ వర్గియా అరెస్ట్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement