ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్ వేలంలో భారీ ధర పలికింది. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో ఆడిన బ్యాట్ను ఇటీవల వేలంగా వేయగా 4.5 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్న అన్ని దేశాల జట్ల క్రికెటర్లు బ్యాట్పై సంతకాలు చేశారు. భారత స్పిన్ దిగ్గజం ఎర్రాపల్లి ప్రసన్న దీన్ని సేకరించారు. ఈ నెల 13న ముంబైలో ఈ బ్యాట్తో సహా అరుదైన క్రీడా వస్తువుల్ని వేలం వేశారు.
భారత తొలి టెస్టు జట్టు దిగిన ఫొటోను 90 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. 1932 ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ సందర్భంగా దిగిన ఫొటోపై అప్పటి టీమిండియా కెప్టెన్ సి.కె.నాయుడు సంతకం చేశాడు. ఇక టెస్టుల్లో హర్భజన్ 400వ వికెట్ తీసిన సందర్భంగా ధరించిన జెర్సీ 2.16 లక్షలకు, శ్రీలంకతో ఓ టెస్టులో హైదరాబాదీ స్టయిలిష్ వీవీఎస్ లక్ష్మణ్ అజేయ సెంచరీ చేసినప్పుడు వేసుకున్న గ్లౌవ్స్ 1.80 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇతర మాజీ క్రికెటర్లు సంతకాలు చేసిన పుస్తకాలు, బ్యాట్లు కూడా భారీ ధర పలికాయి.
రూ. 4.5 లక్షలు పలికిన క్రికెట్ బ్యాట్
Published Mon, Sep 16 2013 3:01 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement