
పెషావర్: పాకిస్థాన్‌లో కీలకమైన జాతీయ ఎన్నికల ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కి భారీ ఊరట దొరికింది. పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను దానికే తిరిగి కేటాయిస్తూ పెషావర్ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
పీటీఐకి బ్యాట్ చిహ్నాన్ని రద్దు చేస్తూ దేశ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment