National Election Watch
-
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
Odisha : ఒడిషా రాజకీయం ఎటు తిరుగుతోంది?
ఒడిశాలో ఎన్నికల స్నేహానికి బీజేపీ, బీజేడీ సిద్ధమవుతున్నాయా? పొత్తు కుదరలేదని తాజా వార్త. కాదు... కుదరవచ్చని ఊహాగానం. ఇప్పటికింకా పూర్తి స్పష్టత లేదు. దోస్తీ మాట నిజమే అయితే, ఒక ప్రశ్న ఉదయిస్తుంది! ‘‘అసలు ఈ రెండు పార్టీలూ కలవాల్సిన అవసరం ఏముంది?’’ రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటుకై బీజేడీకి బీజేపీ అవసరం లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి బీజేడీ అవసరం లేదు. మరి ఏ ప్రయోజనాలు ఆశించి మోదీ, పట్నాయక్‌లు స్నేహహస్తాలు చాస్తున్నారు. 2008 నాటి క్రైస్తవుల హత్యోదంతాల అనంతరం 2009లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పట్నాయక్... పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ పార్టీతో నెయ్యానికి చర్చలు జరిపారు? అడగవలసిన ప్రశ్నలెన్నో ఉన్నాయి! గతాన్ని గుర్తు చేయటం రాజకీయ నాయ కులకు ఇష్టం ఉండదు. అది వారికి ‘‘ఒక పరదేశం’’. ఎల్.పి.హార్ట్లీ చెప్పిన విధంగా, ‘‘వారు అక్కడ పనులను భిన్నంగా చేస్తారు’’. సరిగ్గా అలానే చేసే ఉద్దేశంతో నేనివాళ ఉన్నాను. భారతీయ జనతా పార్టీతో నవీన్ పట్నాయక్ కొత్తగా పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు వినగానే పదిహేను సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలని నాకు అనిపించింది. వాటిని మీకు గుర్తు చేసి, మీ సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. 2008లో కొంధమాల్లో జరిగిన క్రైస్తవుల దారుణ హత్యోదంతాల అనంతరం నేను నవీన్ పట్నాయక్‌ను ఇంటర్వ్యూ చేశాను. ఆ హత్యలు దేశాన్ని కుదిపి వేయటమే కాకుండా, పట్నాయక్ ప్రతిష్ఠను పదేపదే దెబ్బతీశాయి. తేరుకోవటానికి ఆయన తలకిందులుగా తపస్సు చేయవలసి వచ్చింది. ‘‘నా దేహంలోని ప్రతి అస్థికా మతంతో సంబంధం లేనిది. ఆ అస్థికల్లో ఏవైనా దెబ్బతిని ఉంటాయని నేను అనుకోను’’ – అని, లౌకికవాదిగా తనకై తను ఆయన ఒక ఉనికిని ఇచ్చుకున్నారు. ఆరు నెలల తర్వాత, 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు, బీజేపీతో తనకున్న తొమ్మిదేళ్ల పొత్తును విచ్ఛిన్నం చేసుకున్నారు. అప్పుడు మళ్లీ నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పట్నాయక్: ‘‘బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం తప్పనిసరి అయింది. ఎందుకంటే, నా రాష్ట్రానికి వారినిక ఏమాత్రంగానైనా ఆరోగ్యకరమని నేను పరిగణించటం లేదు. కొంధమాల్ తర్వాత అది ప్రతి ఒక్కరికీ స్పష్టమై ఉంటుందని అనుకుంటున్నాను.’’ థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీతో కొనసాగలేమని మీరు చెబుతున్నారా?’’ పట్నాయక్ : ‘‘కొనసాగటం చాలా చాలా కష్టంగా మారింది.’’ థాపర్: ‘‘అంటే కొంధమాల్ ఒక విధంగా మీ పొత్తు విచ్ఛిత్తికి కారణం అయిందనేనా?’’ పట్నాయక్ : ‘‘నిజానికి, అంతే.’’ (ఈ సంభాషణ మరింతగా ముందుకు సాగింది. చెప్పాలంటే, అలా జరగాలన్న ఆసక్తి ఆయనలో కనిపించింది.) థాపర్: కొంధమాల్ ఘటనలతో పట్టణ ప్రాంత మధ్య తరగతి ప్రజలు మిమ్మల్ని నరేంద్ర మోదీతో పోల్చడం ప్రారంభించారు. కొంతమంది మిమ్మల్ని రెండవ నరేంద్ర మోదీ అని కూడా అన్నారు. అది మిమ్మల్ని కలవరపరిచిందా? నొప్పించింది కూడానా?’’ పట్నాయక్: ‘‘నన్ను నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా అలా చూసుకోలేదు. నేను ఎల్లవేళలా లౌకికవాద ధోరణిలోనే ఆలోచిస్తాను. నాది పూర్తిగా లౌకికవాద నేపథ్యం. కనుక నేను దానిని నాపై వచ్చిన సరైన ఆరోపణగా ఏనాడూ పరిగణించలేదు.’’ థాపర్: ‘‘దానర్థం... నరేంద్ర మోదీతో పోల్చడం మిమ్మల్ని బాగా గాయపరచేదిగా ఉండి ఉండాలి.’’ పట్నాయక్: ‘‘నా మీద అలాంటి ఆరోపణ వస్తుందని నేను అస్సలు నమ్మలేకపోయాను.’’ (కొంధమాల్ తర్వాత పట్నాయక్ బీజేపీని ఎలా చూశారన్నది స్పష్టం అయింది. అయితే ఆయన చెప్పాలనుకున్నది ఇంకా ఉండింది. అక్కడితో ముగించలేదు.) థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ శరీరంలోని ప్రతి అస్థికా మత రహితమైనదేనని మీరు చెప్పారు. అది నిజమేనని... మీరిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోవటమన్నది రుజువు చేస్తోందని మీరు చెప్పగలరా?’’ పట్నాయక్: ‘‘మీరేమనుకుంటున్నారు కరణ్? నేనేమిటో మీకు ఎప్పటి నుండో తెలుసు.’’ థాపర్: ‘‘అది నిజమేనని రుజువు చేస్తోందని నేను చెప్పగలను.’’ పట్నాయక్: ‘‘థ్యాంక్యూ.’’ (మరొక ప్రశ్న అడగవలసిన అవసరం ఉందని నా ప్రవృత్తి చెప్పింది. అది ఆయనపై ముష్టిఘాతాన్ని విసిరింది.) థాపర్: ‘‘ఆ పని (బీజేపీతో తెగతెంపులు) మీరు మనస్ఫూర్తిగా చేసినదే కదా?’’ పట్నాయక్: ‘‘చివరికొచ్చేటప్పటికి ఎవరి నమ్మకాలపై వారు నిలబడతారు. కాదా చెప్పండి? ఎవరి నమ్మకాలపై వారు నిలబడి తీరాలి కూడా.’’ (అయిపోయింది – స్పష్టంగా, క్లుప్తంగా, నిశ్చయంగా పట్నా యక్ తనేమిటో చెప్పేశారు. ఆయన నమ్మకాలు తమను తాము పునరుద్ఘాటించుకున్నాయి. పాత పట్నాయక్ ప్రత్యక్షమయ్యారు. బీజేపీతో జతపడి ఉండటం అన్నదిక చరిత్రే.) థాపర్: ‘‘తను నమ్మిన సిద్ధాంతాలపై నిలబడేందుకు నవీన్ పట్నాయక్‌కు తొమ్మిదేళ్లు పట్టిందని చాలామంది అంటారు. మిమ్మల్ని బాగా ఎరిగిన వారికి మీరు లౌకికవాదులు, ఉదారవాదులు, నవీ నులు. నిజంగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే, ఆ పొత్తు దీర్ఘకాలం సాగిందంటే వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నమ్మికలు ఏమిటో మీరు కనుగొనడానికి ఎందుకు మీకంత ఎక్కువ సమయం పట్టింది?’’ పట్నాయక్: ‘‘గత పన్నెండేళ్లలో బీజేపీకి అనేక లౌకికవాద పక్షాల పొత్తు ఉండటం మీరు చూసే ఉంటారు. మమతా బెనర్జీ లేదా హెగ్డే లేదా ఫరూఖ్ అబ్దుల్లా, చివరికి జార్జిఫెర్నాండెజ్, నితిశ్‌కుమార్. అనేక మిత్ర పక్షాలూ ఉండేవి. అంతేకాదు, ఒడిశాలో మన అదృష్టవశాత్తూ మొదటి ఎనిమిదేళ్లలో ఎలాంటి మతపరమైన సంఘటనలూ జరగ లేదు. కొంధమాల్ జరగనంత వరకు మొత్తంగా పరిస్థితే మారలేదు.’’ ప్రస్తుతం ఒకే ఒక ప్రశ్న మిగిలింది. పరిస్థితి ఏం మారింది? బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆ తర్వాత బాగా పని చేసిన పట్నాయక్ తిరిగి ఇప్పుడు వారి ఆలింగనం కోసం ఎందుకు వెనక్కు నడవాలని తపిస్తున్నారు? వారి అవసరం లేకుండానే ఆయన మళ్లీ గెలుస్తారు కదా!అయితే విషయం అది కాదు. ఆయన తెగతెంపులు చేసుకున్న బీజేపీ ఎల్.కె. అద్వానీ నేతృత్వం లోనిది. ఆయనిప్పుడు తిరిగి వెళ్ళాలని చూస్తున్నది నరేంద్ర మోదీ సారథ్యం లోనిది. నేను మరింతగా చెప్పాల్సిన అవసరం ఉందంటారా? పట్నాయక్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు కుదుర్చుకోవాలని అనుకున్నారో నాకెప్పటికైనా తెలుస్తుందా అని నా సందేహం. కానీ తను యూ–టర్న్ తీసుకోవటాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఉంది. ఈలోగా మీదైన అభిప్రాయా లకు మీరు వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. బహుశా మీలోకొందరు... మీరూ నాలాగే ఊహించారని భావించే అవకాశం ఉంది. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
బీజేపీ, బీజేడీకి ప్రతిష్టాత్మకంగా మారిన పూరీ
భువనేశ్వర్: రాష్ట్రంలో పూరీ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ, బీజేడీకి ప్రతిష్టాత్మకం. ఈ నియోజకవర్గం విషయంలోనే రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు వివాదాస్పదమైనట్లు సమాచారం. శ్రీజగన్నాథ క్షేత్రం ప్రాధాన్యతతో పూరీ లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకోవాలని అధికార బీజేడీ గత కొన్ని సంవత్సరాల నుంచే వ్యూహాత్మకంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇంతలో పొత్తు వ్యవహారం వచ్చింది. అయితే ఈ స్థానం తాము సొంతం చేసుకోవాలని చేసిన వ్యూహ రచన అంచనా మేరకు ఫలప్రదం కాలేదు. దీంతో ఇప్పుడు ఒంటరి పోరులోనైనా పూరీ లోక్‌సభ స్థానం చేజిక్కించుకోవాలని ఉభయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా పరిగణించడంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పూరీ లోక్‌సభ స్థానం ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం బీజేడీకి చెందిన పినాకి మిశ్రా పూరీ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రోపై 12,000 ఓట్ల ఆధిక్యంతో గెలిపొందారు. అయితే పినాకి మిశ్రా ఈసారి పోటీ చేయడానికి ఆసక్తి కనబరచడం లేదు. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సంబిత్ పాత్రో పూరీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబిత్ పాత్రోకు ధీటైన పోటీనిచ్చే అభ్యర్థి కోసం అధికార బిజూ జనతా దళ్ లోతుగా ఆలోచిస్తోంది. బీజేడీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్..? ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి, చురుకై న నాయకుడు అరుప్ పట్నాయక్‌ని పూరీ లోక్‌సభకు పినాకి మిశ్రా స్థానంలో బరిలోకి దింపేందుకు బీజేడీ వ్యూహ రచన చేస్తోంది. అలాగే నయాగడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహు, కందమాల్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ అచ్యుత్ సామంత్ అభ్యర్థిత్వాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో, 5 స్థానాల్లో బీజేడీ బలం కొనసాగుతోంది. వీరిలో ఒక ఎమ్మెల్యే ఇటీవల బీజేపీలో చేరడంతో బీజేడీ ఉనికి బీటలు వారింది. 2022లో బిజూ జనతా దళ్ నుంచి బహిష్కరణకు గురైన పూరీ జిల్లా చిలికా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత జగదేవ్ ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. వివాదాస్పదంగా సత్యబాది ఈ జిల్లాలో సత్యబాది శాసనసభ నియోజకవర్గం వివాదాస్పదం అయింది. ఈ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే సంజయ్ దాస్ బర్మా ఖరారైనట్లు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దీంతో బీజేడీ సంక్లిష్ట పరిస్థితిని ఎదురీదాల్సి వచ్చింది. సిటింగ్ ఎమ్మెల్యే ఉమాకాంత సామంతరాయ్తో సమావేశాన్ని నిర్వహించి తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. సంజయ్ దాస్ బర్మా 2 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మగిరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లలితేందు బిద్యాధర్ మహాపాత్రోతో తలపడి సంజయ్ దాస్ బర్మా ఓటిమి పాలయ్యారు. దీంతో ఆయన పరపతి కొంతవరకు మసకబారింది. సత్యబాదిలో ఉమాకాంత సామంతరాయ్‌కు బలమైన ప్రజా నాయకుడుగా గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ఖాతా తెరుచుకోలేని బిజూ జనతా దళ్ 2019లో ఉమాకాంత సామంతరాయ్ పా ర్టీలో చేరిన తర్వాత విజయం సాధించడం తార్కాణంగా నిలిచిపోయింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజేతగా నిలిచారు. అటువంటి నాయకుడి చేరికతో పూరీ జిల్లాలో బీజేడీ క్రమంగా బలం కూడగట్టుకుంది. నయాగడ్‌లో గట్టిపోటి పూరీ జిల్లా నయాగడ్ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈసారి గట్టిపోటీ ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా డాక్టర్ అరుణ్ కుమార్ సాహు గెలిచారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రత్యూష రాజేశ్వరి సింగ్‌ని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈమె కందమాల్ మాజీ ఎంపీ దివంగత హేమేంద్ర చంద్ర సింగ్ భార్య. ప్రత్యూష నయాగడ్ రాణీ మాతగా ప్రాచుర్యం సాధించింది. అలాగే బీజేపీకి చెందిన జయంత్ షడంగి ప్రాతినిథ్యం వహిస్తున్న పూరీ సదర్ సీటుని కై వసం చేసుకోవాలని బీజేడీ ఉరకలేస్తుంది. ఈ అవకాశాన్ని సానుకూలంగా మలచుకుని బీజేడీ టికెటుతో పోటీకి బరిలోకి దిగేందుకు సుభాశిష్ ఖుంటియా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశలో ఆశలు నేరవేరే అవకాశం అంతంతమాత్రమే. పూరీ సదరు నియోజకవర్గం నుంచి దివంగత మాజీ మంత్రి, దీర్ఘకాల బీజేడీ ఎమ్మెల్యే మహేశ్వర్ మహంతి కుమారుడు సునీల్ మహంతిని బరిలోకి దింపి మాజీ నాయకునిపై సానుభూతితో తాజా ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ చేతిలోని పూరీ సదరు స్థానం కై వసం కోసం అధిష్టానం జిత్తులతో సమీక్షిస్తోంది. ఈ నిర్ణయంపై అసంతృప్తి తలెత్తకుండా బీజేడీ అధిష్టానం ముందస్తుంగా సుభాశిష్ ఖుంటియాని రాజ్యసభకు పంపినట్లు తాజా పరిస్థితుల్లో తేటతెల్లమైన విషయం జటిలమైన పరిస్థితిని ప్రేరేపించింది. -
బ్యాట్ గుర్తు ఇమ్రాన్ పార్టీదే
పెషావర్: పాకిస్థాన్‌లో కీలకమైన జాతీయ ఎన్నికల ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కి భారీ ఊరట దొరికింది. పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను దానికే తిరిగి కేటాయిస్తూ పెషావర్ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. పీటీఐకి బ్యాట్ చిహ్నాన్ని రద్దు చేస్తూ దేశ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. -
ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యుల్లో సుమారు 44 శాతం మంది నేరచరితులున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) తేలి్చంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన ప్రస్తుత శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి స్వయంగా అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 ఎమ్మెల్యేలకు గాను 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. -
స్త్రీలపై నేరాల కేసుల్లో 48 మంది చట్టసభ్యులు
న్యూఢిల్లీ: అత్యాచారాలు సహా మహిళలపై అనేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న 48 మంది ప్రస్తుతం దేశంలోని వివిధ చట్టసభల్లో దర్జాగా సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో అత్యధికంగా బీజేపీ నుంచే 12 మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే ప్రమాణ పత్రాల్లోని కేసులను విశ్లేషించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎన్నికల సంస్కరణల కోసం శ్రమిస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ మొత్తం 4,845 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన మీదట ఓ నివేదికను తయారుచేసింది. నేరాలకు పాల్పడి చట్టసభల్లో కూర్చుంటున్న ఈ 48 మందిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కాగా, మిగిలిన 45 మంది వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 12 మంది, పశ్చిమ బెంగాల్లో 11 మంది, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో చెరో 5 మందితో కలిపి 48లో మొత్తం 33 మంది ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. పార్టీల వారీగా అయితే ఈ 48 మందిలో బీజేపీకి చెందినవారు 12 మంది, శివసేన పార్టీ వారు ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు కలిపి ఈ మూడు పార్టీల నుంచే 25 మంది ఉన్నారు. తీవ్ర నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో నిర్ణీత సమయంలో త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నేరం రుజువైతే వారి సభ్యత్వాలను రద్దుచేయడం తదితర సంస్కరణలను ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. అన్ని పార్టీలూ నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నాయనీ, గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 327 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. -
జాతీయ పార్టీలకు రూ.622.38 కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో విరాళాలు అందాయి. జాతీయ స్థాయి రాజకీయ పార్టీలకు రూ.20 వేలకు పైగా వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలకు వచ్చిన విరాళాల వివరాలు ఇందులో పేర్కొంది. అన్నిజాతీయ పార్టీలకు కలిపి మొత్తం 1,695 విరాళాలు అందగా, వాటి విలువ రూ. 622.38 కోట్లు. ఈ రేసులో సహజంగానే అధికార బీజేపీ ముందంజలో ఉంది. ఆ పార్టీకి రూ. 437.35 కోట్ల విరాళాలు వచ్చాయి. గత పదేళ్లుగా బీఎస్పీకి వస్తున్న విరాళాలను వెల్లడిస్తున్నా, ఈ ఆర్థిక సంవత్సరానికి తమకు రూ. 20 వేల పైన విరాళాలు ఏవీ అందలేదని ఆ పార్టీ తెలిపింది. జాతీయ పార్టీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాలు పార్టీలు విరాళాల సంఖ్య రూ. కోట్లలో బీజేపీ 1234 437.35 కాంగ్రెస్ 280 141.46 ఎన్సీపీ 52 38.82 సీపీఎం 74 3.42 సీపీఐ 55 1.33 2013-14 ఆర్థిక సంవత్సరంతో 2014-15 ఆర్థిక సంవత్సరం పోల్చితే అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాలు గణనీయంగా పెరిగాయి. పార్టీలు 2013-14 2014-15 బీజేపీ 170.86 437.35 ఐఎన్‌సీ 59.58 141.46 ఎన్సీపీ 14.02 38.82 సీపీఎం 2.09 3.42 సీపీఐ 1.22 1.33 రెండు పార్టీలకూ ఆ కంపెనీల విరాళాలు కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఇస్తాయి. బీజేపీకి సత్యా ఎలక్టొరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 107.25 కోట్లు, జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 63.02 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 54.01 కోట్లను, సత్యా ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 18.75 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. -
'ఎంపీ కావడానికి 40.30 లక్షలు ఖర్చు చేశారు'
న్యూఢిల్లీ : దేశంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అంతా డబ్బుల మీదే నడుస్తుంది. ఓ మాటలలో చెప్పాలంటే డబ్బు అనే పదం ఎన్నికల పర్యాయపదంగా మారింది. అయితే ఇటీవల జరిగిన16వ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన లోక్‌సభ అభ్యర్థులు ... వారు విజయం సాధించే క్రమంలో ఒక్కోక్కరు సగటున రూ. 40.3 లక్షలు ఖర్చు చేశారని నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్యూ), అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 537 మంది ఎంపీలుగా ఎన్నికైన నేపథ్యంలో వారు జామా ఖర్చులపై అందించిన నివేదిక ఆధారంగా ఆ సంస్థలు ఈ మేరకు తెలిపింది. బీజేపీకి చెందిన 277మంది ఎంపీలు ఎన్నికల కోసం 40.18 లక్షలు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎంపీలు 40.16 లక్షలు ఖర్చు చేసి రెండ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాలు వరుసగా ... ఏఐఏడిఎంకే 37 మంది ఎంపీలు ఒక్కొక్కరు 30.5 లక్షలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 34 మంది 40.6 లక్షల ఖర్చుతో తర్వాత స్థానాన్ని ఆక్రమించారు. కాలిబోర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ్ గోగోయి 80.2 లక్షలు ఖర్చు చేశారు. గుజరాత్‌లోని బరూచ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన మన్సుఖ్ భాయ్ దంచీభాయ్ వసావా, అలహాబాద్ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా 60.7 లక్షలు ఖర్చు చేసి ఆ తర్వాత వరుస స్థానాలలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన అశోక్ గజపతిరాజు రూ.39,369 ఖర్చు చేసి అత్యల్పంగా ఖర్చు చేసిన ఎంపీల జాబితాలో నిలిచారు. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్... నుంచి లోక్‌సభ బరిలో దిగే అభ్యర్థులకు రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షలకు అలాగే చిన్న రాష్ట్రాలైన గోవా... నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు 20.2 లక్షల నుంచి 50.4 లక్షలకు ఈ ఏడాదే పెంచిన సంగతి తెలిసిందే. -
ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులే!
న్యూఢిల్లీ: 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులేనని నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ), అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పరిశీలనలో వెల్లడైంది. మొత్తం 543 ఎంపీలకు 541 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను న్యూ, ఏడీఆర్ పరిశీలించాయి. వారిలో 186 మందిపై (మొత్తం ఎంపీల్లో 34 శాతం మంది) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఈ 186 మంది ఎంపీల్లో 112 మంది (21 శాతం మంది)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. పార్టీలవారీగా చూస్తే బీజేపీ నుంచి ఎన్నికైన 281 మంది ఎంపీల్లో 98 మంది (35 శాతం మంది) ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. అలాగే శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 15 మంది, 44 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 8 మంది, 34 మంది తృణమూల్ ఎంపీల్లో ఏడుగురు, 37 మంది అన్నాడీఎంకే ఎంపీల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 30 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 34 శాతానికి పెరిగింది.